నా భర్త బ్రతికున్నాడో లేదో తెలియదు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
ఈతరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా నటిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో పీఆర్ వరలక్ష్మి ఒకరు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పీఆర్ వరలక్ష్మి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
800కు పైగా సినిమాలలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించిన ఈ నటి న భర్త బ్రతికున్నాడో లేదో తెలియదంటూ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.
"""/"/
సీనియర్ ఎన్టీఆర్, కృష్ణతో పాటు మరి కొందరు సీనియర్ హీరోలకు జోడీగా నటించిన ఈ నటి ప్రస్తుతం తమిళ సీరియళ్లలో నటిస్తున్నారు.
పీఆర్ వరలక్ష్మి మాట్లాడుతూ నాకు సహాయం చేసే అలవాటు ఎక్కువ అని తెలిపారు.
ప్రతిరోజూ ఎంతో కొంత దానం చేసేదానినని అలా దానం చేయని పక్షంలో నాకు నిద్ర పట్టేది కాదని పీఆర్ వరలక్ష్మి చెప్పుకొచ్చారు.
ఎక్కువమందికి సహాయం చేయడం వల్ల కొంత ఆస్తి పోయిందని ఆమె కామెంట్లు చేశారు.
"""/"/
సినిమాల కొరకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు అమ్ముకోవడంతో పాటు ఇతర కారణాల వల్ల మరి కొంత ఆదాయం కోల్పోయానని పీఆర్ వరలక్ష్మి వెల్లడించారు.
నా భర్త ఏ గొడవ జరిగినా సంవత్సరం మాట్లాడేవాడు కాదని అమె అన్నారు.
ఇల్లు అమ్మే విషయంలో జరిగిన గొడవ వల్ల నా భర్త నన్ను వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాడని పీఆర్ వరలక్ష్మి చెప్పుకొచ్చారు.
నా భర్త నన్ను వదిలేసి 30 సంవత్సరాలు అయినా నా భర్త నన్ను మళ్లీ కలవలేదని ఆమె కామెంట్లు చేశారు.
నా భర్త బ్రతికి ఉన్నాడో చనిపోయాడో కూడా నాకు తెలియదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
చిన్న గొడవ వల్ల బంగారం లాంటి మనిషి దూరమయ్యాడని నటి పీఆర్ వరలక్ష్మి అన్నారు.
చిరంజీవి లైనప్ లో చేరిన మరో స్టార్ డైరెక్టర్…