హిందూ మతాన్ని నమ్మడం వేరు.. వాడుకోవడం వేరు..పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డు ( Tirupathi Laddu ) వ్యవహారం సంచలనంగా మారింది.

తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం జంతువుల అవశేషాల నుంచి తయారు చేసిన నూనె ఉపయోగించి లడ్డు తయారు చేశారని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి.

ఇక ఈ విషయంపై ఎంతోమంది వివిధ రకాలుగా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ఇక లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వలేదు దీంతో పలు రకాల విమర్శలు వస్తున్నాయి.

"""/" / ఇక లడ్డు కల్తీ జరిగిందనే విషయం తెలియడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా ఈ విషయం పై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియచేసారు.

ఇకపోతే సినీనటి పూనమ్ కౌర్ ( Poonam Kaur ) సైతం ఈ వ్యవహారంపై స్పందించారు.

అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

ఈమె చేసే ఈ సంచలనమైన పోస్టులు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం స్పష్టంగా తెలియకపోయినా ఆ పోస్టులు మాత్రం చర్చలకు కారణం అవుతూ ఉంటాయి.

"""/" / అయితే తాజాగా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి ఈమె స్పందిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

హిందూయిజాన్ని స్వలాభం కోసం వాడుకోవటం వేరు.హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు అంటూ ఈమె చేసిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ను టార్గెట్ చేస్తూ ఈమె పరోక్షంగా పోస్టులు పెడుతున్నారు అయితే ఈమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారా లేకపోతే జగన్( Jagan ) ను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారా అన్నది మాత్రం తెలియదు కానీ ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది.

వీడియో: బిర్యానీలో ఐస్‌క్రీమా.. ఈ ఫుడ్ కాంబినేషన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!