పవిత్రా లోకేష్ మొదటి భర్త ఎవరో తెలుసా.. ఈమె రెండో భార్య అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవిత్రా లోకేశ్ కు మంచి గుర్తింపు ఉంది.

టెంపర్, బెంగాల్ టైగర్ మరికొన్ని సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

పవిత్రా లోకేశ్ రెమ్యునరేషన్ కూడా గతంలో పోలిస్తే భారీస్థాయిలో పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

కొన్నిరోజుల క్రితం పవిత్రా లోకేశ్ వీకే నరేష్ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వైరల్ కాగా వీళ్లిద్దరూ ఆ వార్తల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడలేదు.

అయితే పవిత్రా లోకేశ్ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే కోర్టు విడాకులను మంజూరు చేయనుందని తెలుస్తోంది.

అదే సమయంలో పవిత్రా లోకేష్ భర్తకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పవిత్రా లోకేశ్ మొదటి భర్త పేరు సుచేంద్ర ప్రసాద్ కాగా 2007 సంవత్సరంలో వీళ్లిద్దరి వివాహం జరిగింది.

పవిత్ర లోకేశ్ 300కు పైగా సినిమాలలో నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయవంతమయ్యాయి.

సుచేంద్ర ప్రసాద్ మొదటి భార్య పేరు మల్లికా ప్రసాద్ అని సమాచారం. """/"/ 2002 సంవత్సరంలో వీళ్లిద్దరికీ వివాహం జరిగిందని 2007 సంవత్సరంలో విడిపోయారని తెలుస్తోంది.

మొదటి భార్యతో విడాకుల తర్వాత సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేశ్ ను పెళ్లి చేసుకున్నారు.

మరోవైపు పవిత్ర లోకేశ్ వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

"""/"/ పవిత్ర లోకేశ్ ఈ వార్తల గురించి క్లారిటీ ఇవ్వని పక్షంలో చాలామంది ఆమె గురించి తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పవిత్ర లోకేశ్ నటిగా పలు అవార్డులను గెలుచుకున్నారు.ప్రస్తుతం పవిత్ర లోకేశ్ అమ్మ, అక్క, వదిన తరహా పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు.

పవిత్రా లోకేశ్ కు తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి.

ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?