నేను నటిని కాకపోతే టీ షాప్ పెట్టేదాన్ని.. తంగలాన్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్( Vikram ) కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

విక్రమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.మరికొన్ని రోజుల్లో విక్రమ్ తంగలాన్ సినిమా( Thangalaan )తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తంగలాన్ మూవీలో నటించిన నటి పార్వతి తిరువోతు తాను నటిని కాకపోయి ఉంటే టీ షాప్ పెట్టేదానినని తెలిపారు.

వృత్తి ఏదైనా సరే మర్యాద, గౌరవంతో చేయాలని నేను అనుకున్నానని ఆమె పేర్కొన్నారు.

"""/" / అందులో భాగంగానే నేను టీ షాప్ పెట్టాలని అనుకున్నానని ఆమె వెల్లడించారు.

ఆ తర్వాత మాళవిక మోహనన్ మాట్లాడుతూ నాకు విజువల్ ఆర్ట్స్ అంటే ఎంతో ఇష్టమని ఫోటోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీ వైపు అడుగులు వేయాలని అనుకున్నానని ఆమె వెల్లడించారు.

తంగలాన్ హీరోయిన్లు చెప్పిన విషయాలు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.పార్వతి మాట్లాడుతూ పా రంజిత్ డైరెక్షన్ లో ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఫీలవుతున్నానని వెల్లడించారు.

"""/" / తంగలాన్ సినిమాలో నేను గంగమ్మ అనే రోల్ లో కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ పాత్ర కోసం నేను ఎంతో శ్రమించానని భాషపరంగా కూడా కసరత్తు చేశానని ఆమె పేర్కొన్నారు.

కర్ణాటక( Karnataka)లోని కేజీఎఫ్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.హీరో విక్రమ్ తాను గతంలో ఏ సినిమా కోసం కూడా ఈ సినిమా స్థాయిలో మాత్రం కష్టపడలేదని వెల్లడించడం గమనార్హం.

తంగలాన్ విభిన్నమైన కథ అని ఈ సినిమాలో గ్లామర్ కు చోటు లేదని విక్రమ్ వెల్లడించారు.

తంగలాన్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుందని వెల్లడించారు.

ఆగష్టు నెల 15వ తేదీన తంగలాన్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

తంగలాన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వాలంటీర్ల కొనసాగింపు పై చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ