నటి పరిణితి చోప్రా… రాఘవ చద్దా పెళ్లి తేదీ ఫిక్స్.?
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పరిణితి చోప్రా( Parineeti Chopra ) త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్న విషయం మనకు తెలిసిందే.
గత కొంతకాలంగా ఈమె ఎంపీ రాఘవ చద్దా( Raghava Chadda) అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.
అయితే వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసే వీరిద్దరూ ఎంతో అంగరంగ వైభవంగా సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో నిశ్చితార్థం( Engagment) జరిగింది.
ఇలా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు.
"""/" /
ఇలా వీరిని నిశ్చితార్థమైన తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులు కలిసే వీరి వివాహపు తేదీని ఫిక్స్ చేశారని తెలుస్తుంది ఇక వీరి వివాహం సెప్టెంబర్ 25వ(September 25th) తేదీ జరగబోతుందని, వీరి పెళ్లికి ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్( Uday Villas ) పరిణీతి-రాఘవ్ వివాహానికి వేదిక కానుంది.
ఇప్పటికే తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని వాటన్నింటిని నటి పరిణీతి దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పెళ్లికి రెండు వారాల ముందే తన ప్రాజెక్ట్ షూటింగ్స్ అన్నింటినీ పూర్తి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
"""/" /
ఇలా పెళ్లికి ముందే తాను కమిట్ అయినటువంటి సినిమా ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక రాఘవ చద్దా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ లో ఎంపీగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
పరిణీతి-రాఘవ్ ల వివాహం వాళ్ళ నిశ్సితార్ధం లాగే కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనుందని.
పెళ్లి తర్వాత గురుగ్రామ్( Gurugram ) లో మాత్రం భారీగా రిసెప్షన్ ప్లాన్ చేశారట.
ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం.
గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?