200 కోట్ల కేసులో సాక్షిగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి?

సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఇతని పేరు మార్మోగిపోతోంది.

200 కోట్లు మనీలాండరింగ్ విషయంలో ఇతను అరెస్టు అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇతను ఈడీ అధికారులు సమక్షం లో ఉన్నాడు.

ఇకపోతే ఈ కేసు విషయంలో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇతనితో ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీలకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు బాలీవుడ్ బ్యూటీ ల పేర్లు బయట పడిన విషయం విధితమే.

ఈ కేసు విషయంలో ముఖ్యంగా ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఒకటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రెండవది నోరా ఫతేహీ.

ఈ రెండు వందల కోట్ల మనీలాండరింగ్ కేసు విషయంలో ఈ ఇద్దరి బ్యూటీలకు ఎన్నోసార్లు ఈడీ అధికారులు ప్రశ్నించగా.

అతని నుంచి కోట్ల విలువ చేసే బహుమతులు వారికి అందినట్లు తెలిపారు.అయితే ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ ని ఢిల్లీ కోర్టుకు అప్పగించింది ఈ డి.

అందులో 2020లో నోరా ఫతేహీ కి సుఖేష్ చంద్రశేఖర్ ఒక బీఎండబ్ల్యూ కారు, 75 లక్షలు క్యాష్ తో పాటు కోట్లు విలువ చేసే ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు అని తెలిపింది.

అలాగే జాక్వెలిన్ సైతం తనకు కోట్లు విలువ చేసే అవుట్ ఫిట్స్, షూస్, డైమండ్ చెవి దిద్దులు, బ్రాస్ లైట్ లాంటివి అందుకున్నట్లు ఆమె తెలిపింది.

"""/" / నోరా ఫతేహీ ఈ కేసు బాధితురాలు మాత్రమే కావడంతో సాక్షిగా ఉండనుంది.

విచారణలో ఈమె అధికారులకు సహకరిస్తోంది.ఈ మనీలాండరింగ్ కేసులో ఆమె కు ఎటువంటి సంబంధం లేదని, సురేష్ మోసగాడని తెలియదని, అలాగే నిందితుడితో ఎలాంటి సంబంధం లేదని ఈమె తరపున విడుదలైన స్టేట్మెంట్లో రాసుకొచ్చింది.

ఇకపోతే ఈ కేసులో ఈడి అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.రోజుకొక బాలీవుడ్ బ్యూటీ పేరు వినిపిస్తూనే ఉంది.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమాల ద్వారా కంటే ఇతని కేసు విషయంలోనే హైలెట్ గా నిలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్17, సోమవారం 2024