నడవలేని స్థితిలో స్టార్ హీరోయిన్ నిత్యామీనన్.. ఏంజరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి సినిమాలు చేయడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు.ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో నిత్యామీనన్ ఖాతాలో సక్సెస్ చేరింది.

భీమ్లా నాయక్ సినిమాలో నిత్యామీనన్ రోల్ పరిమితమే అయినా తన నటనతో నిత్యామీనన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నిత్యామీనన్ నటించిన మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే ఈ వెబ్ సిరీస్ లాంఛ్ కార్యక్రమంలో నిత్యామీనన్ నడవలేని స్థితిలో కనిపించారు.

ఈ ఈవెంట్ లో నిత్యామీనన్ స్టిక్ పట్టుకుని కనిపించగా తనకు నడవలేని స్థితి రావడానికి సంబంధించి నిత్యామీనన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నిత్యామీనన్ మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ లో తాను ఎల్బో క్రచ్ తో కనిపించానని ఆమె తెలిపారు.

అయితే వెబ్ సిరీస్ లో ఏ విధంగా జరిగిందో నిజ జీవితంలో కూడా అదే విధంగా జరుగుతోందని ఆమె కామెంట్లు చేశారు.రెండురోజుల క్రితం తాను మెట్లపై నుంచి కింద పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

అందువల్లే ఎల్బో క్రచ్ తో తాను నడవాల్సి వస్తోందని ఆమె తెలిపారు.రేవతి మేడం నాకు సొంత ఇంటి మనిషిలా అనిపిస్తారని నిత్యామీనన్ కామెంట్లు చేశారు.

రేవతి మేడం ఎలా ఉంటారో అమ్మ కూడా అలానే ఉంటారని నిత్యామీనన్ అన్నారు.< -->ఈ వెబ్ సిరీస్ తో నిత్యామీనన్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

సినిమాసినిమాకు నిత్యామీనన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది.నిత్యామీనన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

నిత్యామీనన్ కోటి నుంచి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

నేడు మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్...!

నా కష్టాలు మీకు ఎఫెక్ట్ అయ్యాయా? నామినేషన్స్ లో కీర్తి కన్నీళ్లు!

సంపాదిస్తున్న దాంట్లో 90% దానం చేస్తున్న హీరో .. ఎందుకో తెలుసా ?

లాభాల బాటలో ఆర్టీసీ : టీఎస్ఆర్టీసీ ఛైర్మన్

విజయనగరంలో జిల్లాలో పెద్ద పులి టెన్షన్..!

డ్రగ్స్ మాఫియాపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

శ్రద్ధా కపూర్ మస్తీ ఫొటోస్