అలాంటి వాళ్లు నాతో అస్సలు మాట్లాడొద్దు.. నిహారిక కామెంట్స్ వైరల్..?

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నిహారికకు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

గతేడాది పెళ్లి చేసుకుని పెళ్లికి సంబంధించిన విశేషాల ద్వారా వార్తల్లో నిలిచిన నిహారిక సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటారు.

ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్న నిహారిక ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

"""/"/ నిహారిక తన లుక్ ను మార్చుకోగా కొత్త లుక్ లో కూడా నిహారిక చాలా అందంగా ఉన్నారని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగులో నిహారిక ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలలో నటించగా ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి.

తెలుగులో నిహారిక మూడు వెబ్ సిరీస్ లను నిర్మించారు.ఆ వెబ్ సిరీస్ లు యూట్యూబ్ లో మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి.

పెళ్లి తర్వాత నిహారిక గ్లామరస్ ఫోటోలను కూడా అభిమానులను పంచుకుంటున్నారు.ప్రస్తుతం నిహారిక చైతన్య పాండిచ్చేరిలో ఉన్నారు.

తాజాగా నిహారిక ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆ ఫోటో గురించి పెట్టిన కామెంట్ నెట్టింట చర్చనీయాంశం అయింది.

నిహారిక తనను తాను అద్దంలో చూసుకుంటూ ఫోటో దిగడంతో పాటు " పార్థు ఇంకోసారి చూసి చెప్పు" అంటూ అతడు సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ ను పెట్టారు.

"""/"/ ఆ తర్వాత తన కామెంట్ చూసి ఆ కామెంట్ గుర్తుకు రాని వాళ్లు దయచేసి తనకు మెసేజ్ చేయవద్దని నిహారిక అన్నారు.

నిహారిక కామెంట్ కు కొందరు నెటిజన్లు ఫన్నీగా "నిజం చెబుతున్నా నువ్వు అంత అందంగా లేవు" అని కామెంట్లు పెడుతుంటే మరి కొందరు మాత్రం నిహారిక చాలా అందంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభాస్ దారిలో నడుస్తున్న అక్కినేని హీరో.. ఆ బ్యానర్ లో నటించనున్నారా?