మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఈమె కష్టానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నందిని రాయ్ ( Tollywood Heroine Nandini Roy )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నందిని.సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.
సినిమాలలో గ్లామర్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన నందిని బయట మాత్రం చాలా సింపుల్గా పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
"""/" /
ఇక సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక చింతనలలో మునిగి తేలుతూ ఉంటుంది.
కాగా ఆమెకు దైవ భక్తి ఎక్కువే అన్న విషయం తెలిసిందే.ఇప్పటికే గతంలో ఆమె చాలాసార్లు తిరుమల తిరుపతి( Tirumala Tirupati ) శ్రీవారిని దర్శించుకుంది.
అలా గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని, తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ చేరుకున్నారు.
అయితే ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.
వైకుంఠ ఏకాదశి( Vaikuntha Ekadashi ) సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు.
"""/" /
ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు.
మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు.అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు.
అయితే సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్ల పై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నిజంగా చాలా గ్రేట్ అంటూ హీరోయిన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే నందిని రాయ్ విషయానికి వస్తే.తెలుగులో చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నందిని.
బిగ్ బాస్ 2( Bigg Boss 2 ) తెలుగు సీజన్ తో చాలా మందికి దగ్గరైంది.
అయితే 2011లోనే ఫ్యామిలీ ప్యాక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో మాత్రం 040 మూవీతో అడుగుపెట్టింది.
కోలీవుడ్ లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నందిని రాయ్ నటించింది.
తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.
దారుణం, రక్షకుడే భక్షకుడయ్యాడు.. పబ్లిక్‌లో యువతిని రక్తం వచ్చేలా ఎలా కొట్టాడో చూస్తే..