నాలుగు పదుల వయసులో పెళ్లిపై మనసు పారేసుకున్న నటి నగ్మా… పెళ్లి చేసుకోవాలనుందంటూ?
TeluguStop.com
పెద్దింటి అల్లుడు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి నగ్మా(Nagma).
మొదటి సినిమాతోనే హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఏడాదికి సుమారు ఐదారు సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు.
కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం మలయాళం భోజ్ పురి ఇండస్ట్రీలో కూడా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే పలువురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారంటూ తన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
"""/" /
ఇలా పలువురు హీరోలతో రిలేషన్ లో ఉన్నటువంటి నగ్మా వారితో బ్రేకప్ చెప్పుకొని ఎవరిని పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం సింగిల్ (Single)గానే ఉంటున్నారని చెప్పాలి.
ఇలా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నటువంటి నగ్మా మొదటిసారి పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ పెళ్లి (Marriage)గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
48 సంవత్సరాల వయసులో ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ.పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన తనకు లేదని ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ.
పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది.కాలం కలిసి వస్తే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు.
"""/" /
నిజంగానే నాకు పెళ్లి జరిగితే చాలా సంతోషపడతానని ఈమె తెలిపారు.
సంతోషం అనేది కొంతకాలం మాత్రమే పరిమితం కాదు కదా అంటూ ఈ సందర్భంగా నగ్మా ఈ వయసులో పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి( Nagma Marriage ) చేసుకోవాలని ఉందని చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా పెళ్లి గురించి ఇంత కాన్ఫిడెన్స్ గా ఈమె మాట్లాడారు అంటే త్వరలోనే నగ్మా శుభవార్త చెప్పబోతున్నారనీ పలువురు నెటిజెన్స్ ఈమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.
మరి నగ్మా శుభవార్తను ఎప్పుడు చెబుతారో వేచి చూడాలి.
వైరల్ వీడియో: పెద్దాయనే కానీ మహానుభావుడు..