నగ్మా గంగూలీ విడిపోవడానికి కారణమేంటో తెలుసా?
TeluguStop.com
సినిమా నటిగా, రాజకీయ నాయకురాలిగా నగ్మా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళంలో తక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన నగ్మా బాలీవుడ్ లో మాత్రం నటిగా ఒక వెలుగు వెలిగారు.
రాజరిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ.
తల్లి ప్రోత్సాహంతో నగ్మా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.భాషా సినిమా నగ్మాకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టింది.
తెలుగులో ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, అల్లరి రాముడు సినిమాలలో నగ్మా నటించారు.
అయితే కొన్ని సంవత్సరాల క్రితం నగ్మా, గంగూలీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.అప్పట్లో నగ్మా, గంగూలీ డేటింగ్ కు సంబంధించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి.
గంగూలీకి 1997లో వివాహం కాగా పెళ్లైన తర్వాత గంగూలీ నగ్మాతో ప్రేమలో ఉండటం అప్పట్లో చర్చకు దారితీసింది.
గంగూలీ, నగ్మా కలిసి పార్టీలు చేసుకోవడంతో పాటు విందులకు హాజరయ్యే వారని సమాచారం.
"""/"/1999 వరల్డ్ కప్ సమయంలో నగ్మా, గంగూలీ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ నిజమేనని నగ్మా, గంగూలీ అభిమానులు నమ్మారు.
వీళ్లిద్దరూ జంటగా శ్రీకాళహస్తిలో పూజలు చేయించడం మీడియాకు తెలిసింది.అయితే తరువాత కాలంలో కొన్ని కారణాల వల్ల నగ్మా, గంగూలీ విడిపోయారు.
"""/"/
ఒక సందర్భంలో నగ్మా మాట్లాడుతూ తమ బంధానికి ఈగో అడ్డుగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
రిలేషన్ షిప్ లో అహం ఉంటే ఆ బంధం ఎక్కువకాలం నిలవదని నగ్మా కామెంట్లు చేశారు.
అయితే గంగూలీ మాత్రం నగ్మా బిహేవియర్ నచ్చకపోవడంతో ఆమెతో విడిపోయినట్లు ప్రచారం జరిగింది.
నిన్న గంగూలీ పుట్టినరోజు కావడంతో నగ్మా, గంగూలీ విడిపోవటానికి గల కారణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్