మెగాస్టార్ పై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి.ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టి.


అద్భుత సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగు సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపాడు.


ప్రస్తుతం కూడా పలు భారీ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీపడి నటిస్తున్నాడు.
అయితే ఈయనతో నటించేందుకు ఎంతో మంది హీరోయిన్లు క్యూకడతారు.ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు.
తమ రేంజి పెరిగిపోతుంది.తమకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు.
అయితే ఓ హీరోయిన్ మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.ఆయనతో కలిసి నటించడం మూలంగానే తనకు అవకాశాలు రాలేదని కామెంట్ చేసింది.
ఏ దర్శకుడు కూడా తనకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చిరంజీవిపై ఓపెన్ గా కామెంట్ చేసిన ఆ నటీమణి ఎవరో కాదు మోహిని.
దాదాపు 100 సినిమాల్లో నటించిన ఈ తార పలు హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆదిత్య 369 సినిమాతో చక్కటి పేరు తెచ్చుకుంది.తమిళ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసింది.
అక్కడే అగ్రతారగా మారిపోయింది.అయితే చిరంజీవి మూలంగా తాను తెలుగు సినిమా పరిశ్రమలో రాణించలేకపోయానని చెప్పింది.
ఆయన వల్లే ఎక్కువ అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం కలిగిస్తున్నాయి.
"""/"/
చిరంజీవితో చేయడం వల్ల ఎందుకు అవకాశాలు కోల్పోయిందో కూడా చెప్పింది.హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించింది.
ఇందులో రాజేంద్ర ప్రసాద్ భార్యగా చేసింది.చిరంజీవికి చెల్లిగా చేయడంతో ఆమెకు ఆ తర్వాత హీరోయిన్ పాత్రలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రాలేదట.
"""/"/ అందుకే చిరంజీవి సినిమాలో నటించి తాను నష్టపోయినని వ్యాఖ్యానించింది ఈ ముద్దుగుమ్మ.
అటు తన వివాహం గురించి కూడా పలు విషయాలు వెల్లడించింది.తన ఐదు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
రెండు సార్లు చనిపోవాలని ఆత్మహత్యా యత్నం చేసినట్లు చెప్పింది.ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బస్సులో నిద్రిస్తున్న మహిళను వేధించిన కండక్టర్.. వీడు కండక్టర్ కాదు, కామాంధుడు.. వీడియో వైరల్