Pawan Kalyan: ఆ హీరోయిన్ డ్రీమ్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం.. మరి అవకాశం వస్తుందా?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మేఘా ఆకాష్( Megha Akash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హీరో నితిన్( Nitin ) నటించిన లై సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు సరైన గుర్తింపు దక్కలేదు.

ఆ తర్వాత చల్ మోహన్ రంగా సినిమాలో నటించి మెప్పించింది.ఈ సినిమా కూడా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత రాజ రాజ చోర, డియర్ మేఘ ( Raja Raja Chora, Dear Megha )లాంటి సినిమాలలో నటించింది.

టాలీవుడ్లో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కలేదు. """/" / అయినప్పటికీ ఈమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.ఇది ఇలా ఉంటే రవితేజ( Ravi Teja ) తాజాగా నటించిన రావణాసుర( Ravanasura ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకొని దూసుకుపోతోంది.

ఈ సినిమాతో హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది మేఘా ఆకాష్.

ఈ సినిమా విడుదల కాకముందు ప్రమోషన్స్ లో పాల్గొన్న మేఘా ఆకాష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. """/" / నటిగా తన ప్రయాణం పట్ల తనకు దక్కిన గుర్తింపు పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిపింది.

అతిగా ఆశించడం తనకు నచ్చదు అని ఆమె తెలిపింది.అలాగే తనకు పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలన్నది తన డ్రీమ్ అని ఆమె చెప్పుకొచ్చింది.

అదెప్పుడో నెరవేరుతుందో చూడాలి.నేను ఇష్టపడే వాతావరణంలో నచ్చిన పాత్రలతో ప్రయాణాన్ని ఆస్వాదిస్తానంటూ చెప్పుకొచ్చింది అని తెలిపింది మేఘా ఆకాష్.

అలాగే సెట్ లో ఉన్నప్పుడు మానిటర్ వైపు చూడదని బాగా చేశానా లేదా అన్నది డైరెక్టర్ ని అడిగి తెలుసుకుంటానని ఆమె తెలిపింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న అని తెలిపింది.

మరి ఈ ముద్దుగుమ్మ కల నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి మరి.

ఆ పని మరే హీరో చేయలేరు… అల్లు అర్జున్ దమ్మున్న హీరో: రష్మిక