ప్రియుడితో హీరోయిన్ నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..
TeluguStop.com
యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్( Megha Akash ) విజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
క్యూట్ గా, అందంగా కనిపించే, నటనతో మెప్పించి ఈ హీరోయిన్ చేసిన సినిమాలు తక్కువే కానీ.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అభిమానుల్ని సంపాదించుకుంది.ఇవన్నీ ఉన్న చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే విజయం తప్పకుండా అందుకోవాల్సిందే.
మేఘా ఆకాష్.నితిన్ హీరోగా ' లై ' చిత్రంలో( Lie Movie ) మొదటిసారిగా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సుందరి.
"""/" /
అయితే కాలం కలిసిరాక వరుస సినిమాలో ప్లాప్ అవడంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి.
ఇకపోతే కొన్ని రోజులుగా ఆవిడ పెళ్లి గురించి రూమర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఈ రూమర్స్ ను నిజం చేస్తూ.తాజాగా మేఘా ఆకాష్ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్( Engagement ) చేసేసుకుంది.
మేఘా ఆకాష్.సాయి విష్ణు( Sai Vishnu ) అనే కుర్రాడితో ప్రేమ వివాహాన్ని చేసుకోబోతోంది.
ఇందుకు సంబంధించి గురువారం నాడు ఆవిడ సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది. """/" /
ఇక వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
అయితే మేఘా ఆకాష్ ప్రియుడు సాయి విష్ణు బ్యాక్ గ్రౌండ్., అతడు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.
మేఘా ఆకాష్ తన నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలను అభిమానులంతో పంచుకుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మేఘా ఆకాష్, సాయి విష్ణుల జోడి చాలా చూడముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు.
ఇక వీరిద్దరి వివాహం సంబంధించి తేదీ ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు.