త్వరలోనే మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ.. నిజమేనా?
TeluguStop.com
ఒకప్పటి నటులు మళ్లీ సినీ ఇండస్ట్రీలకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే చాలామంది నటీనటులు రీ ఎంట్రీ ఇవ్వగా వరుస సినిమాలతో తెగ దూసుకుపోతున్నారు.
ఇక గత కొన్ని రోజుల నుండి మీరా జాస్మిన్ పేరు బాగా వినిపిస్తుంది.
అంతేకాకుండా తాను త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ తన నటనతో, తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2001లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మీరా జాస్మిన్.అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి పలు సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.
ఇక గతంలో ఈమె పై కొన్ని పుకార్లు కూడా బాగా వినిపించాయి.అవన్నీ పట్టించుకోకుండా తన జీవితం ఏంటో తాను చూసుకుంది.
"""/"/ ఇక 2014లో దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని తెలపగా మళ్లీ ఇప్పటివరకు ఎటువంటి అవకాశాలు అందుకోలేదు.
కాగా తన పెళ్లి తర్వాత కొన్ని విభేదాలు రావడంతో తన భర్త నుండి విడాకులు తీసుకుంది.
ఆ సమయంలో మళ్లీ సినిమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. """/"/
ఇక ఒకప్పుడు బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడు పూర్తిగా సన్నబడింది.
తెగ వర్క్ అవుట్ లు చేస్తూ తన శరీర బరువుని పూర్తిగా తగ్గించుకుంది.
ఇదంతా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈమెకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.ఇక మీరజాస్మిన్ రీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు.
విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలు ఇవేనా..?