అతనే నా ఫస్ట్ క్రష్….మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) ప్రస్తుతం  సౌత్ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయారు.

ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

లక్కీ భాస్కర్ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన మీనాక్షి చౌదరి తాజాగా వెంకటేష్ ( Venkatesh )హీరోగా నటించిన సంక్రాంతి వస్తున్నాం( Sankranthiki Vastunnam ) సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

"""/" / ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఈమె వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీ ఫస్ట్ క్రష్ ( First Crush ) ఎవరు అనే ప్రశ్న మీనాక్షి చౌదరికి ఎదురైంది.

దీంతో ఈమె తన ఫస్ట్ క్రష్ ఎవరు అనే విషయాన్ని బయటపెట్టారు. """/" / స్కూల్ చదువుతున్న రోజుల్లో తన టీచర్ పైనే తన ఫస్ట్ క్రష్ ఉండేదని తెలిపారు.

తనకు మాత్రమే కాదు మా క్లాస్ లో ఉన్న అమ్మాయిలు అందరకీ కూడా ఆయనపై అలాంటి ఫీలింగ్ ఉండేదని తెలిపారు.

ఇక అతని తర్వాత మరెవరిపై కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ కలగలేదు అంటూ ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి తన ఫస్ట్ క్రష్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో చాలా సహజంగా నటించానని.జీవితంలో అందరికీ ఏదో ఒక సమయంలో లవ్ స్టోరీ ఉంటుంది.

ఇదే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేయటం ఈ సినిమా మంచి సక్సెస్ కావడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆస్ట్రోటాక్ జ్యోతిష్యుడి పరువు గంగపాలు.. పెళ్లయిన ఆమెకే మళ్లీ పెళ్లి అంటూ?