Actress Mallika Jagula : బతుకుదెరువు కోసం చీరలమ్మా.. రాత్రికి పెగ్గేసి పడుకుంటా.. నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
చిన్నచితకా పాత్రలలో నటించి సినిమాలు, సీరియళ్ల ద్వారా మల్లిక జాగుల( Actress Mallika Jagula ) పాపులారిటీని సంపాదించుకున్నారు.
సీరియల్ కిల్లర్ తరహా పాత్రలలో నటించిన మల్లిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
సీరియల్స్ ద్వారా ఆమె డబ్బుతో పాటు పేరును సైతం సంపాదించుకోవడం గమనార్హం.అయితే సీరియళ్లలో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఆమె సీరియళ్లకు సైతం గుడ్ బై చెప్పారు.
స్మాల్ స్క్రీన్ పై రీఎంట్రీ( Re Entry ) ఇచ్చిన మల్లిక తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వరని బెంగళూరు నుంచి తీసుకొస్తారని మమ్మల్ని చిన్నచూపు చూస్తారని ఛాన్స్ లు కూడా అలా ఇవ్వకపోయేసరికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని నటి కామెంట్లు చేశారు.
సరిగ్గా తిండి కూడా తినకపోవడం వల్ల నిలబడిన చోటే పడిపోయేదాన్నని ఆమె వెల్లడించారు.
"""/"/
ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్తే బ్రతకడం కష్టమని అన్నారని ఆ స్టేజ్ నుంచి మళ్లీ బ్రతికొచ్చానని మల్లిక తెలిపారు.
19 సంవత్సరాల అనుభవం ఉన్నా కరోనా తర్వాత ఆఫర్లు తగ్గాయని ఆమె కామెంట్లు చేశారు.
బతుకుదెరువు కోసం చీరలు అమ్మానని పెట్రోల్ బంక్ లో పని చేయడానికి కూడా సిద్ధమయ్యానని మల్లిక చెప్పుకొచ్చారు.
పదేళ్ల క్రితం నా పారితోషికం 1300 రూపాయలు( Remuneration ) అని నాలుగేళ్లు అదే రెమ్యునరేషన్ కు వర్క్ చేశానని ఆమె అన్నారు.
"""/"/
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డబ్బులు సంపాదిస్తారని అందరూ అనుకుంటారని అయితే అందరి పరిస్థితి అలా ఉండదని మల్లిక వెల్లడించారు.
సినిమా ఆఫర్లు వచ్చాయని ఒక అడిషన్ కు వెళ్తే కమిట్ మెంట్( Commitment ) అడిగారని ఆమె పేర్కొన్నారు.
నేను శరీరాన్ని అమ్ముకోలేదని శరీరాన్ని చూపించుకున్నాను అంతేనని ఆమె పేర్కొన్నారు.మల్లిక వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!