అలేఖ్య చిట్టి పికిల్స్… నెటిజన్లకు కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ …  పచ్చళ్ళ పాపలు అంటూ!

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles)వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

యూట్యూబ్ ఛానల్ ద్వారా అలేఖ్య సిస్టర్స్ పికిల్ బిజినెస్ ప్రారంభించారు.వీరి బిజినెస్ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

అయితే ఇటీవల ఓ కస్టమర్ పికిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్ చేయడంతో అలేఖ్య బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టింది.

దీంతో పెద్ద ఎత్తున ఈ ముగ్గురు అక్క చెల్లెలు విమర్శలకు కారణమవుతున్నారు.అయితే వీరి తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి ట్రోల్స్(Trolls) ఆగడం లేదు.

"""/" / చివరికి అలేఖ్య మానసిక శోభను అనుభవిస్తూ హాస్పిటల్ పాలయ్యారు.ప్రస్తుతం ఈమె ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇలా అలేఖ్య హాస్పిటల్ పాలైనప్పటికీ కొంతమంది నేటిజన్స్ వీరిని విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలోనే హీరోయిన్ మాధవి లత (Madhavi Latha)ఈ ఘటన పై స్పందించారు.

ఈ సందర్భంగా మాధవి లత అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం గురించి మాట్లాడుతూ నేటిజన్స్ కి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

"""/" / ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ.చైనా జపాన్ వాడు ఏదేదో కనిపెడుతున్నాడు.

మన యువత మాత్రం పచ్చళ్ళ పాపల గురించి మాట్లాడుతున్నారు.ఏదైనా పనికొచ్చే పని చేయమంటే ఇలా పచ్చళ్ళ పాపల వెంట పడటం ఏంటి అంటూ ఈమె నెటిజెన్లకు తనదైన శైలిలోనే కౌంటర్లు ఇచ్చారు.

ఇక ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీకి గత కొంతకాలంగా దూరంగా ఉన్న మాధవి లత తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.