గుర్రపు పందాలపై వచ్చిన డబ్బును సీనియర్ నటి లక్ష్మి ఏం చేసిందో తెలుసా?
TeluguStop.com

ఒక్కోసారి కొందరు చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి.డబ్బులు సంపాదిస్తారు.


సంపాదించిన డబ్బు సక్రమంగా రాలేదని బాధ పడతారు.వచ్చిన డబ్బును జనాలకు పంచేస్తారు.


హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.సేమ్ ఇలాగే ఫీలయ్యింది సీనియర్ నటి లక్ష్మి.
ఇంతకీ తను ఏ విషయంలో డబ్బును అక్రమంగా సంపాదించినట్లు ఫీలయ్యిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక కన్నడ సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె బెంగళూరుకు వెళ్లారు.అక్కత తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి రేసులకు వెళ్లారు.
నిజానికి ఆమెకు రేసులకు వెళ్లే అలవాటు లేదు.కానీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు రేస్ కోర్సుకు పోయారు.
అందరూ తమ తమ లక్ చూసుకుంటున్నారు.తన లక్ ఎలా ఉందో చూసుకుందామనుకున్నారు తను.
ఆరోజు తన లక్ మామూలుగా లేదు.ఒక గుర్రం మీద 5 రూపాయలు పందెం కట్టారు.
ఆ గుర్రం దూసుకెళ్లి నెంబర్ వన్ గా నిలిచింది.5 రూపాయలు పందెం కట్టిన ఆమెకు 5 వందల రూపాయల లాభం వచ్చింది.
తన సంతోషానికి అవదుల్లేవు.కానీ కాసేపయ్యాక తనలో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ కలిగింది.
"""/"/
తాను సంపాదించిన డబ్బు న్యాయంగా రాలేదు అని మదన పడింది.అన్యాయంగా వచ్చిన ఈ డబ్బును ఏం చేయాలి? అని ఆలోచించింది.
చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది.ఆ డబ్బును పేదలకు పంచి పెట్టాలని భావించింది.
జనాలందరినీ పిలిచి వారికి పంపిణీ చేసింది.ఆ తర్వాత తను జీవితంలో మరెప్పుడూ రేసుల వైపు వెళ్లలేదు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించింది ఆమె.
తాజాగా నందినీరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబి సినిమాలో అద్భుత నటన కనబర్చింది.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ప్రస్తుతం పలు సినిమాల్లో చేసేందుకు ఓకే చెప్పింది.
లాక్ డౌన్ కారణంగా ఆయా సినిమాలు ఆగిపోయాయి.
ఈ రెమెడీని పాటిస్తే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ గానే మెరిసిపోతారు!