పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. నటి కుష్బూ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన కుష్బూ( Kushboo ) సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడం లేదనే సంగతి తెలిసిందే.
కుష్బూకు కెరీర్ పరంగా భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే ది కేరళ స్టోరీ మూవీ గురించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా వల్ల లవ్ జిహాద్ అంశం గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది.
అయితే కుష్బూ గతంలో మతం మారారనే సంగతి తెలిసిందే.కొంతమంది కావాలని కుష్బూను టార్గెట్ చేస్తూ ది కేరళ స్టోరీ సినిమా( The Kerala Story ) వల్ల విమర్శలు చేస్తుండగా ఆమె స్పందించి తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.
పెళ్లి కోసం నేను మతం మారినట్టు ప్రచారం చేసేవాళ్లు కొంచెం తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని కుష్బూ తెలిపారు.
మన దేశంలో ఉన్న వివాహ చట్టం గురించి కచ్చితంగా వాళ్లకు తెలిసుండదని కుష్బూ పేర్కొన్నారు.
"""/" /
పెళ్లి కోసం నేను ఏ ఒక్క మతానికి మారలేదని మతం మారాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు.
నా 23 సంవత్సరాల పెళ్లి జీవితం, గౌరవం, నమ్మకం, సమానత్వం ప్రేమకు ప్రతీకగా ఉంటుందని కుష్బూ కామెంట్లు చేయడం గమనార్హం.
కుష్బూ స్పందించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆమెను విమర్శించే వాళ్లు ఇకనైనా సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది.
"""/" /
కుష్బూ భర్త పేరు సుందర్ అనే సంగతి తెలిసిందే.నటి కుష్బూ తాజాగా ది కేరళ స్టోరీ మూవీ అందరూ చూడాల్సిన మూవీ అని చెప్పుకొచ్చారు.
అబద్ధపు కారణాలతో తమిళనాడు( Tamil Nadu ) ప్రభుత్వం ఈ సినిమాపై బ్యాన్ విధించిందని ఆమె చెప్పుకొచ్చారు.
కుష్బూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కుష్బూ కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.
వీడియో: తాత కిల్లర్ స్టెప్పులు.. ఆ పాటకు డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశాడంతే!