అలాంటి వాటికి ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ ఒప్పించారు.. నటి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్( Tollywood ) నటీమణులలో ఒకరైన కృష్ణకుమారి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలకు సంబంధించి తాను ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదని ఆమె తెలిపారు.లక్షాధికారి సినిమా కోసం నన్ను స్విమ్మింగ్ క్యాస్టూమ్ వేసుకోవాలని కోరారని ప్రొడ్యూసర్ చెబితే నేను వేసుకోనని చెప్పానని కృష్ణకుమారి కామెంట్లు చేశారు.

మీరు కావాలంటే ఎన్టీఆర్( NTR ) గారిని కూడా అడగండి ఆయన కూడా వద్దని చెబుతారని నేను అన్నానని కృష్ణకుమారి వెల్లడించారు.

ఎన్టీఆర్ రామారావు గారిని వెళ్లి అడిగితే ఆయన మాత్రం అలా చేస్తే బాగుంటుందని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ అలా చెప్పడం వల్ల ఆ సీన్ చేశానని ఆమె కామెంట్లు చేశారు.

ఆ సన్నివేశానికి సంబంధించి షూటింగ్ పూర్తైందని సెన్సార్ సభ్యులు పూల్ లో మగవాడు ఉండకూడదని చెప్పారని కృష్ణకుమారి( Krishna Kumari ) చెప్పుకొచ్చారు.

"""/" / ఆ తర్వాత ఆ సీన్ సినిమా నుంచి తొలగించడం జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని ఆయన నాకోసం ఎంతగానో ఎదురుచూశారని కృష్ణకుమారి చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లను ఎవరైనా ఇబ్బంది పెడతారని ఆయన మాత్రం అలా చేయలేదని కృష్ణకుమారి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

"""/" / నేను చేసుకున్న వ్యక్తి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

ఇండస్ట్రీలో ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోకూడదని భావించానని కృష్ణకుమారి అన్నారు.పాత కాలంలో ఇండస్ట్రీ గురించి నెగిటివ్ గా వచ్చిందని తర్వాత ఆ అభిప్రాయం మారిందని ఆమె తెలిపారు.

కృష్ణకుమారి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ జనరేషన్ ఆడియన్స్ లో కూడా కృష్ణకుమారి నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

2018 సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో కృష్ణకుమారి మృతి చెందారు.

వీడియో: పిచ్చికి పరాకాష్ట.. రీల్స్ కోసం మెట్ల పైనుంచి దొర్లిన యువతి..