ఏ ముహూర్తాన అలా చెప్పానో కానీ . వారానికే నా కొడుకుని పోగొట్టుకున్నాను: కోట

కోటా శ్రీనివాసరావు  తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.వందల సినిమాల్లో అద్భుత క్యారెక్టర్లు చేసి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.

ఆయన నట వారసుడిగా కుమారుడు ఆంజనేయప్రసాద్‌ కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.

గాయం-2 సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు.తన కొడుకును మంచి అర్టిస్టుగా తీర్చిదిద్దాలని జేడి చక్రవర్తితో పాటు జగపతి బాబుకు అప్పగించాడు కోటా.

ఓరోజు సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లాడు.అక్కడ ఓ సీన్ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అవన్నీ చూసి కోటాకు ఏదో తెలియని బాధ కలిగింది.అప్పుడు తన బాధను కొడుక్కి చెప్పాడు.

అలాగే అన్నాడు.ఓ సీన్ లో కోటా అబ్బాయిని జగపతి బాబు చంపుతాడు.

అంతేకాదు.చంపి కోటా ఇంటి ముందు పడేస్తాడు.

అక్కడే ఓ పాడె కూడా ఏర్పాటు చేశారు.చేసేది సినిమా అయినా.

ఎందుకో కోటా మనసు చాలా కల్లోలంగా ఉంది.నటనే అయినా.

కొడుకు పాడె మీద పడుకోవడం భరించలేకపోయాడు.నెమ్మదిగా జగపతి బాబు దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాలి అనుకున్నాడు.

మీ కొడుకు బాగా చేస్తున్నాడండీ .ఇండస్ట్రీకి మంచి ఆర్టిస్టు దొరికాడు అని చెప్పాడు.

అది కాదండి ఓ విషయం చెప్పాలి అన్నాడు కోటా.సరే చెప్పండి అన్నాడు.

"""/" / మా వాడిని అలా పాడె మీద చూడలేనండీ.ఆ సీన్ చూస్తుంటేనే భయం వేస్తుంది.

నాకేదోలా ఉంది.కాస్త ఈ సీన్ అవాయిడ్ చేయండి అని చెప్పాడు.

కాసేపు జగపతి బాబు ఆలోచించాడు.ఏం ఫర్వాలేదంటే.

ఈ సీన్ లో డూప్ యాక్ట్ చేస్తాడని చెప్పాడు.ఏ బాధతో అన్నానో.

వారం రోజులు తిరిగే సరికి అదే జరిగింది.ఏ సీన్ చేస్తుంటే భయపడ్డానో.

నా ఇంట్లో అదే సీన్ చూడాల్సి వచ్చింది. """/" / వాడు బైక్ మీద వెళ్తుంటే.

వెనుక కోడలు, మనవరాళ్లు కారులో వెళ్తున్నారు.అంతలోనే యాక్సిడెంట్ అయ్యింది.

మా వాడు చనిపోయాడు.ఆ సమయంలో మా కడుపుకోత ఎవరికి అర్థం అవుతుంది.

నా భార్యను ఓదార్చలేకపోయా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కోటా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024