Keerthy Suresh : ఆ స్టార్ హీరోని నమ్మి కీర్తి సురేష్ అలా మోసపోయిందా.. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా అలా చేసిందా?
TeluguStop.com

కొంతమంది నటి నటులు కొన్ని కొన్ని సార్లు మోసపోతుంటారు.ముఖ్యంగా సినిమాల విషయంలో మోసపోతుంటారు.


అలా కీర్తి సురేష్ కూడా ఓ సారి మోసపోయింది.అది కూడా ఒక స్టార్ హీరోని నమ్మి మోసపోయింది.


దాంతో ఈ సారి ఆమె కాస్త జాగ్రత్త పడినట్లు తెలిసింది.మరి ఆమె ఏ విషయంలో మోసపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈమె.2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
ఇక 2016లో నేను శైలజ( Nenu Sailaja ) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన తొలి చూపులతోనే ఆకట్టుకుంది.
"""/"/
ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి( Mahanati Savitri ) పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.
ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.
ఇక మధ్యలో కొన్ని హిట్ కు అందుకోగా కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకుంది.
అయినా కూడా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇక సోషల్ మీడియా( Social Media )లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, తన సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.
ఇక ఈమధ్య హాట్ లుక్ తో, గ్లామర్ ఫోజ్ తో.నేను కూడా తక్కువేమికాదనట్లూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.
పైగా బాగా సన్నబడటంతో ఇంకాస్త రెచ్చిపోతుంది. """/"/
ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా హడావుడి చేస్తుంది.
దీంతో ఆమె గ్లామర్ షో( Glamor Show ) చేయటంతో ఆమె అభిమానులు ఆమెపై కొన్ని కొన్ని సార్లు ఫైర్ అవుతున్నారు.
మునిపటిలా మారామని సలహాలు ఇస్తున్నారు.ఇక రీసెంట్ గా ఆమె దసరా సినిమాతో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
"""/"/
అయితే ఈమె గతంలో ఒక స్టార్ హీరో వల్ల మోసపోయిందన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ అయింది.
అసలు విషయం ఏంటంటే.గతంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా( Shyamsingha Roy )లో సాయి పల్లవి కంటే ముందు కీర్తి సురేష్ కు అవకాశం వచ్చిందట.
కానీ ఆమె ఆ సమయంలో రజనీకాంత్ తో పెద్దన్న సినిమా కమిట్ అయ్యి ఉండటంతో ఈ సినిమాకు నో చెప్పిందట.
"""/"/
పైగా రజనికాంత్( Rajinikanth ) లాంటి లెజండ్ హీరోతో సినిమా చేస్తే తన కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని అనుకోని నాని సినిమాకు నో చెప్పిందట.
కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే బాక్సాఫీస్ వద్ద శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఇక ఆమె ఆశలు పెట్టుకొని నటించిన పెద్దన్న( Pedhanna ) అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
దీంతో ఆ సమయంలో తను ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడినట్లు తెలిసింది.
ఆ తర్వాత మరో సినిమాలో కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.దీంతో దసరా సినిమా( Dasara )లో నాని సరసన అవకాశం రావడంతో.
ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసిందని తెలిసింది.
జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!