సంపాదించిందంతా ఆ పనులకు ఉపయోగిస్తున్న గృహలక్ష్మి నటి.. నెటిజన్స్ షాక్!

తెలుగు తెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ గురించి మనందరికీ తెలిసిందే.

ఆ సీరియల్ లో తులసి క్యారెక్టర్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది కస్తూరి శంకర్.

ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించిన కస్తూరి శంకర్ తర్వాత కొద్ది కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.

ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన కస్తూరి శంకర్ ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అయితే సీరియల్ లో ఒక గృహలక్ష్మి ఎలా అయితే ఉండాలో అలా పద్ధతిగా ఉంటూ కుటుంబ బాధ్యతలను భుజాలపై వేసుకుని నడిపిస్తూ చిన్న అవమానాలు ఎదుర్కొంటూ ఇంట్లో గృహలక్ష్మి పడే కష్టాలను చూపిస్తుంది.

ఇది ఇలా ఉంటే సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది.

అయితే ఆమె తన శరీర పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది కస్తూరి శంకర్.

లేకపోతే మొన్నటికి మొన్న కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార సరోగసి సంతానానికి సంబంధించి ఒక ట్వీట్ చేయడంతో అది కాస్త వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది కస్తూరి శంకర్.

"""/"/ అదేంటంటే ఆమె చెన్నైలో మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుపోయిందని దాంతో మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయగా వారు ఆమె ఫిర్యాదు పై స్పందించి ఆమెకు ఫోను తిరిగి ఇచ్చినట్లు తెలిపింది.

దీతో మెట్రో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ట్వీట్‌ చేసింది.చెన్నై మెట్రో సిబ్బంది, అధికారులపై నాకు మరింత గౌరవం పెరిగింది.

మెట్రో రైలులో పొగొట్టుకున్న నా ఫోన్‌ను వారు గంటల్లోనే వెతికిపెట్టి ఇచ్చారు.పని విషయంలో వారు చూపిస్తున్న నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది.

ఇలా ఉంతోమంది ప్యాసింజర్‌ పొగొట్టుకున్న వస్తువులను వేతికి ఇస్తున్నారు.అందుకే చెన్నైమెట్రో అధికారులు, సిబ్బంది అంటే నాకు గౌరవం అంటూ ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చింది కస్తూరి శంకర్.

"""/"/ కాగా కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒక నెటిజన్ మీకు సొంతంగా కార్లు ఉంటాయి కదా వాటిలో వెళ్ళొచ్చు కదా అని అడగడంతో.

ఆ విషయంపై స్పందించిన కస్తూరి శంకర్ నాకు కారు, ఏసీ టీవీ ఇలా ఏమీ లేవు.

నేను ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను అని తెలిపింది.ఇంతలోనే మరొక నెటిజన్ నువ్వు సంపాదిస్తున్న దంతా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించగా.

వెంటనే కస్తూరి శంకర్ స్పందిస్తు.నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను అని తెలిపింది.

కస్తూరి శంకర్ చేస్తున్న పనికి అభిమానులు ఫిదా అవడంతో పాటు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.