ఆ ఫౌండేషన్ కు హిందువులు విరాళాలు ఇవ్వొద్దు.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!

సినిమాల ద్వారా, బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా కరాటే కళ్యాణి పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.

తాజాగా ఈ నటి వివాదంలో చిక్కుకున్నారు.జగద్గిరి గుట్టలో ఈ నటిపై కేసు నమోదైంది.

గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కరాటే కళ్యాణి ఒక హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల కరాటే కళ్యాణిపై కేసును నమోదు చేశారు.

నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి డిస్ట్రిక్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ను దాఖలు చేయగా కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి కరాటే కళ్యాణి స్పందించి వివరణ ఇచ్చారు.

ఒక అధ్యాత్మిక సంస్థ హిందూ మతం పేరుతో ప్రజల నుంచి డబ్బులను వసూలు చేస్తోందని అందుకు సంబంధించి ప్రశ్నించడంతో తన గురించి తప్పుడు వార్తలు రాయడంతో పాటు ట్రోల్ చేస్తున్నారని కరాటే కళ్యాణి వెల్లడించారు.

హైదరాబాద్ లో ఉన్న శివశక్తి ఫౌండేషన్ ఒక దుష్ట శక్తి అని హిందువుల నుంచి సేకరించే విరాళాలను ఆ ఫౌండేషన్ సొంత అవసరాల కోసం వినియోగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ ఫౌండేషన్ లో సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశారని కరాటే కళ్యాణి విమర్శలు చేశారు.

అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించడంతో తనను ట్రోల్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

"""/" / శివ శక్తి ఫౌండేషన్ డైరెక్టర్లు, అధ్యక్షుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు.

ఆ ఫౌండేషన్ కు హిందువులు విరాళాలు ఇవ్వవద్దని ఫౌండేషన్ అక్రమాల గురించి ఇప్పటికే ఫిర్యాదు చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

కరాటే కళ్యాణి చేసిన ఆరోపణల గురించి శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్లు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. UK యూనివర్సిటీ నుంచి భారీ స్కాలర్‌షిప్‌లు!