ఎయిర్ హోస్టెస్ వసుంధర.. అందాల తార కాంచనగా ఎలా మారిందో తెలుసా?

వసుంధర అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.కాంచన అంటే చాలా మందికి సుపరిచితమే.

ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది ఈ భామ.కాలేజీ నుంచి నాటకాల్లోకి అడుగు పెట్టిన ఈ తార.

ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేసింది.సినీ నిర్మాత పరిచయంతో సినిమాల్లోకి వచ్చి అగ్రతారగా ఎదిగింది.

విజయవాడలో పుట్టిన కాంచన.మద్రాసులో పెరిగింది.

తండ్రి రామకృష్ణ శాస్త్రి ప్రముఖ ఇంజనీర్.చిన్నప్పట్నించీ కాంచనకు సంగీతం అంటే ఇష్టం.

రేడియోలో వచ్చే పాటల్ని వింటూ తనూ పాడేది.పాటకు తగినట్లు నాట్యం కూడా చేసేది.

దీంతో ఆమె పేరెంట్స్ నాట్యంలో శిక్షణ ఇప్పించారు.స్కూల్ చదువు అయ్యాక ఇంటర్మీడియెట్ కోసం యతిరాజ్ కాలేజీలో చేరింది.

అదే సమయంలో నాటకాలు వేసి మంచి నటన కనబరిచేది.ఇంటర్ అయ్యాక చదువు మానేసింది.

ఇంట్లో ఖాళీగా ఉండి ఓ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి అప్లై చేసింది.ఎయిర్ హోస్టెస్‌గా రెండేళ్లు ఉద్యోగం చేసింది.

ఆ తర్వాత జాబ్ విసుగు పుట్టించింది.ఓసారి తమిళ నిర్మాత కోవై చెళియన్ విమాన ప్రయాణంలో ఆమెను చూశాడు.

తన మిత్రుడైన డైరెక్టర్ శ్రీధర్‌కు ఆమె గురించి చెప్పాడు.అదే సమయంలలో శ్రీధర్ కాదలిక్క నేరమిల్లై సినిమాను కలర్ లో తియ్యాలనుకున్నాడు.

కొత్త నటుల కోసం చూస్తున్నాడు.కాంచనను శ్రీధర్‌కు పరిచయం చేశాడు కోవై చెళియన్.

కాంచన ముఖ కదలికలు శ్రీధర్‌కు బాగా నచ్చాయి.అందుకే తన సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు.

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని మానేసి.సినిమాల్లోకి అడుగు పెట్టింది.

కాదలిక్క నేరమిల్లై సినిమా భారీగా కలెక్షన్లను సాధించింది.ఒకే ఒక్క సినిమాతో కాంచనకు ఎంతో గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా విజయంతో పలువురు నిర్మాతలు, దర్శకులు ఆమెను తమ సినిమాల్లో నటించాలని కోరారు.

"""/"/ రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ లో వీరాభిమన్యు చిత్రంలో నటించింది.తెలుగు వారికి దగ్గరయ్యింది.

అన్నపూర్ణ పిక్చర్స్ ఆత్మగౌరవం, పద్మశ్రీ ప్రేమించి చూడు.నేనంటే నేనే, తల్లి ప్రేమ, భలే మాస్టారు సినిమాల్లో నటించింది.

తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.తమిళంలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

హిందీలో ఫర్జ్ అనే సినిమా చేశారు.కాంచన అసలు పేరు వసుంధర.

సినిమాల్లోకి వచ్చినప్పుడు కాంచనగా పేరు మార్చుకున్నారు.

వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి