కాజోల్ అందంపై నెటిజన్స్ షాకింగ్ ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన నటి?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది కాజోల్.
అంతేకాకుండా 90ల కాలంలో అయితే తన అందం అభినయంతో కట్టిపడేయడంతో పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
అలాగే మూడు దశాబ్దలుగా తన నటనతో అలరిస్తూ లక్షలాది మంది అభిమమానుల్ని మనసులలో స్థానం సంపాదించుకుంది.
బెఖుడి అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. """/"/
ఆ తర్వాత నటించిన బాజీగర్ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ దృష్టి కాజోల్ పై పడింది.
ఆ తరువాత ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడిన కాజోల్ 1999 ఫిబ్రవరి 24న వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రలో నటిస్తోంది.కాగా కాజోల్ వయసు పెరిగే కొద్ది అందం రెట్టింపు అవుతోంది.
48 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందాలతో మెరిసిపోతోంది.తల్లి చెప్పిన చిట్కాలను పాటిస్తూ తన అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.
"""/"/
ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కాజోల్ అందంపై కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె పాత ఫోటోలను లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్కిన్ వైటెనింగ్ సర్జరీ చేయించుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
కాగా ఆ ఫోటోలపై,ట్రోల్స్ పై స్పందించిన కాజోల్ తెల్లగా అవ్వడం కోసం గతంలో తాను ఎటువంటి సర్జరీలు చేసుకోలేదని, సినిమా షూటింగ్స్ కోసం గతంలో ఎండలో ఎక్కువసేపు గడిపానని అందుకే కాస్త నల్ల పడినట్లు అని చెప్పుకొచ్చింది.
తేజ సజ్జ బాటలోనే నడుస్తున్న విశ్వక్ సేన్…