జూనియర్ సుహాసిని కెరీర్ నాశనం అవవడానికి కారణం ఏంటి..?

కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ రోజులు ఉంటుందని మన అందరికీ తెలిసిందే.

ఈ తక్కువ టైం లో హీరోయిన్స్ కూడా చాలా ప్లాన్డ్ గా వెళితేనే ఆ మాత్రం కెరియర్ అయిన ఉంటుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తూ వెళ్తే ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం అయితే ఇండస్ట్రీలో ఒకసారి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది అంటే చాలు చాలా మంది డైరెక్టర్లు వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కావడానికి డైరెక్టర్ కష్టం ఎంత ఉంటుందో అంతకుమించి కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి ఫలానా హీరోయిన్ ని తీసుకోవడం వల్ల సినిమా బాగా ఆడింది, ఫలానా ఆర్టిస్ట్ ను తీసుకోవడం వల్ల సినిమా దొబ్బింది అని నమ్మకాలు చాలా ఉంటాయి.

అప్పట్లో వీటన్నిటిని దాటుకుంటూ వచ్చి శ్రేయ లాంటి హీరోయిన్లు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.

అప్పుడు ఉన్న టాప్ హీరోలందరితో నటించిన ఏకైక నటి ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రేయ అనే చెప్పాలి.

ఆవిడ చేసిన సంతోషం, ఠాగూర్, చత్రపతి, భాలు, అర్జున్, నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించారు.

గుర్తింపు పొందిన వారి పరిస్థితి ఇలా ఉంటే నటిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయిన వారు కొందరు ఉన్నారు.

అయితే కెరీర్ మొదట్లో మంచి అవకాశాలు అందుకున్న వేద అలియాస్ అర్చన కూడా మొదట్లో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ ఎందుకో ఆవిడ పెద్దగా క్లిక్ కాలేకపోయింది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నేను లాంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు కూడా సాధించింది అలాంటి అర్చనకి హీరోయిన్ గా లాంగ్ కెరీర్ ఉంటుందని అందరూ భావించారు కానీ తనకి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.

కొన్ని సినిమాల్లో పెద్ద హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినప్పటికీ తను ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో దర్శక నిర్మాతలు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆ తరహాలో ఆవిడకి వేషాలు తగ్గిపోయాయి.

ఒకవేళ వచ్చిన హీరోయిన్ అవకాశాలు రాలేదు అలాగే ఈవిడ తరహాలోనే జూనియర్ సుహాసిని కూడా బాలాదిత్య హీరోగా పరిచయమవుతూ బి.

జయ దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటిగాడు సినిమాతో మంచి హిట్ సాధించినప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో ఆవిడ తమిళం, భోజ్ పూరి సినిమాల్లో ఎక్కువగా నటించింది.

అయితే జూనియర్ సుహాసిని గా తెలుగులో మంచి గుర్తింపు సాధించినప్పటికీ తెలుగులో చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసింది తప్ప పెద్ద హీరోలతో అవకాశాలు రాలేదు.

అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమాలో దేవుడి భార్య లో ఒక భార్య గా నటించినప్పటికీ దానివల్ల పెద్దగా ఉపయోగం లేకపోయింది.

అప్పుడు చేసిన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు దాంతో సుహాసిని సినిమా కెరియర్ తక్కువ కాలంలోనే ముగిసింది.

"""/"/ అయితే ఆవిడతో పాటు ఆ టైంలో ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ అయిన త్రిష ఇలియానా లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు.

అయితే ఒక దగ్గర ఫ్లాప్ అయినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా సుహాసిని బుల్లితెరపై మ్యాజిక్ చేయడానికి సీరియల్స్ లో నటించారు.

ఆవిడ నాగబాబు నటించిన అపరంజి సీరియల్ లో నటించి మంచి గుర్తింపు సాధించారు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ బుల్లితెరపై తన నటనా ప్రతిభను చూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఆమె బుల్లితెరపై వరుస సీరియల్స్ లో నటిస్తూ నటిగా చాలా బిజీ అయిపోయారు.

అయితే తనతో పాటు ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మ గారిని పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం వీళ్లు సంతోషంగా వాళ్ల లైఫ్ నీ లీడ్ చేస్తున్నారు.

Mahbubnagar District : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్