Anu Prabhakar Jayanthi: ఇష్టపడి తెచ్చుకున్న కోడలు..కానీ కోటి రూపాయలు ఇచ్చి మరి విడాకులు
TeluguStop.com
నటి జయంతి( Actress Jayanthi ) పేరు తెలియని వారు ఎవరు ఉండరు.
తెలుగు, తమిళ, కన్నడ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి వయసు పెరిగిన కొద్దీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి పూర్తి జీవితం అనుభవించారు.
అయితే జయంతి లైఫ్ లో మాత్రం పెళ్లిళ్లు అచ్చి రాలేదు.ఆమె మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
నటుడు మరియు దర్శకుడు అయినా పేకేటి శివరాం ని ఆమె మొదట వివాహం చేసుకున్న అది ఎక్కువ కాలం నిలవలేదు.
ఆ తర్వాత నిర్మాత చందాన గిరిబాబు ని పెళ్లాడారు.ఈ సారికూడా ఆమె వైవాహిక జీవితం సాఫీగా లేకపోవడం తో విడాకులు తీసుకొని మరొక వివాహం చేసుకున్నారు.
"""/" /
ఈ మూడు పెళ్లిళ్ల ద్వారా ఆమెకు ఒక కుమారుడు మాత్రమే జన్మించాడు.
అతడి పేరు కృష్ణ కుమార్.( Krishna Kumar ) జయంతి కి ఎలాగూ పెళ్లి కలిసి రాలేదు.
కానీ కొడుకు కోసం అయినా మంచి నిర్ణయం తీసుకోవాలని జయంతి చూసింది.అందుకే నటి అను ప్రభాకర్ ని( Anu Prabhakar ) తన కొడుక్కి ఇచ్చి 2002 లో వివాహం చేసింది.
దాదాపు 12 ఏళ్ళు కలిసి ఉన్న ఈ ఇద్దరికీ మనస్పర్థలు రావడం తో విడివిడిగా ఉంటూ వచ్చారు.
మొదట కృష్ణ కుమార్ అను కి లీగల్ నోటిస్ పంపించగా, మళ్లి పెద్దలు కూర్చొని రాజి చేసారు.
కానీ ఒక ఏడాది పాటు తీవ్రమైన మనస్పర్థలు రావడం తో ఇక తప్పని పరిష్టితి లో విడాకుల కోసం కోర్ట్ కి ఎక్కారు.
ఇద్దరి అంగీకారం తో విడాకుల మంజూరు అయ్యింది. """/" /
కాగా అను కి జయంతి ఈ విడాకుల టైం లో దాదాపు కోటి రూపాయలను ముట్టచెప్పింది.
ఎంతో ఇష్టపడి అనుని తన ఇంటికి కోడలిగా తెచ్చుకుంది.కానీ ఎంత ప్రయత్నించినా ఆ వివాహం వర్క్ అవుట్ కాలేదు.
ఇలా జయంతి కి ఆమె కొడుక్కి పెళ్లి అచ్చి రాలేదు .ఇక జయంతి కొడుకు కృష్ణ రావు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ని నడుపుతున్నాడు.
అను ప్రభాకర్ సైతం కృష్ణ రావు తో విడాకులు తీసుకున్న నాలుగేళ్లకు రఘు ముఖర్జీ అనే తన తోటి నటుడు మరియు మోడల్ అయినా వ్యక్తి ని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది.
ఇక జయంతిలో 2021 లో వయసు పైబడటం తో కన్ను మూసారు.