ఆ సినిమా కోసం వెంకటేశ్ ఒడిలో కూర్చున్నానన్న నటి.. నాగ్ కు అన్నం తినిపించానంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటి జయలక్ష్మి( Actress Jayalakshmi ) ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జయలక్ష్మి మాట్లాడుతూ నేను పెద్దపెద్ద డైరెక్టర్ల డైరెక్షన్ లో చాలా సినిమాలలో చేశానని ఆమె తెలిపారు.

వరుసగా ఒకే డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో తాను నటించలేదని జయలక్ష్మి తెలిపారు.

రావు రమేష్( Rao Ramesh ) లాంటి ఆర్టిస్ట్ ల పక్కన చేయడం లక్ గా భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

బొమ్మరిల్లు సినిమాలో( Bommarillu ) నా రోల్ చిన్న రోల్ అయినా ఆ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపు మామూలు గుర్తింపు కాదని ఆమె కామెంట్లు చేశారు.

కె.విశ్వనాథ్ ( K Vishwanath ) డైరెక్షన్ లో కూడా నటించానని జయలక్ష్మి పేర్కొన్నారు.

నేను ఎన్ని సినిమాలలో నటించానో గుర్తు లేదని ఆమె తెలిపారు.చేసిన ప్రతి సినిమా ఆడియన్స్ లోకి వెళ్లిందని జయలక్ష్మి చెప్పుకొచ్చారు.

"""/" / ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేశ్( Venkatesh ) గారి ఒడిలో కూర్చునే సీన్ లో చేశానని ఆ సీన్ చాలా ఫన్నీ సీన్ అని ఆమె తెలిపారు.

నా బరువు తక్కువని అలా కూర్చోమన్నారని నన్ను ఇబ్బంది పెట్టకుండా కంఫర్ట్ లా కూర్చునేలా షూట్ చేశారని ఆమె అన్నారు.

ఆ సీన్ కు రెండు మూడు టేక్స్ పట్టిందని జయలక్ష్మి పేర్కొన్నారు.సినిమాలు చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తానని ఆమె తెలిపారు.

"""/" / గ్రీకువీరుడు సినిమాలో నేను నాగార్జునకు( Nagarjuna ) యంగ్ మేనత్తగా చేశానని ఆ సినిమాలో కొడుకుకు పిసికిపిసికి ముద్దలు పెడతానని జయలక్ష్మి చెప్పుకొచ్చారు.

నాగార్జున పాత్ర రియలైజ్ అయిన సమయంలో అత్తా.నాకు నీ చేతితో అన్నం కలిపి ముద్దలు పెట్టాలని చెబుతారని ఆ సినిమా చాలా మంచి అనుభవం అని జయలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు.

జయలక్ష్మి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘భైరవం’ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందా..?