ఛీ ఛీ అనిపించుకోవడం కంటే అదే నయం.. నటి ఇంద్రజ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు వెండి తెరపై అగ్రతారంగా కొనసాగిన ఇంద్రజ పెళ్లయిన తర్వాత వెండితెరకు దూరమయ్యారు.

ఈ క్రమంలోనే కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఈమె సినిమాలలో కన్నా బుల్లితెర కార్యక్రమాల ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతంగా ప్రారంభించారు.

ప్రస్తుతం బుల్లితెరపై ఈమె పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులపాటు తప్పుకుంది.

ఈ క్రమంలోనే రోజా స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు.ఇలా ఐదు వారాలపాటు జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణయంతగా వ్యవహరించిన ఇంద్రజ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.

అయితే రోజా రీఎంట్రీ ఇవ్వడంతో ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి పర్మనెంట్ జడ్జ్ గా మారిపోయారు.

ఈ కార్యక్రమంలో ఇంద్రజ సుదీర్ తో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు.తల్లి కొడుకుల అంటూ వీరిద్దరూ చేసే ఫన్ ఎంతో అద్భుతంగా ఉండేది.

ఇకపోతే సుధీర్ మెల్లిమెల్లిగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి బయటకు రావడంతో ఇంద్రజ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

"""/"/ ఈ విధంగా అనుకోకుండా ఇంద్రజ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి జడ్జిగా జబర్దస్త్ కార్యక్రమంలో పర్మినెంట్ అయ్యారు.

అయితే చాలామంది సుదీర్ ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడం వల్లే ఈమె కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చింది అని భావించారు.

కానీ ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని వదిలి ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా వెల్లడించారు.

ఇప్పుడు తాను జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయ నిర్ణయితగా సందడి చేస్తూ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా తానే కనిపిస్తే జనాలు ఛీ కొడతారు.

అలా వారితో ఛీ కొట్టించుకునే బదులు ఆ కార్యక్రమం వదిలి బయటకు రావడమే మంచిదనిపించి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి బయటకు వచ్చానని ఇంద్రజ వెల్లడించారు.