వేలంపాట అంటే జడ్జిమెంట్ అనుకున్నారా.. రోజాపై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు చాలా సంవత్సరాలుగా రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.మరోవైపు గత కొన్ని వారాల నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఈటీవీ ఛానల్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక ఈవెంట్ ప్రసారం కానుండగా ఊరిలో వినాయకుడు పేరుతో ప్రసారమవుతున్న ఈ ఈవెంట్ లో రోజా టీమ్ ఒకవైపు ఇంద్రజ టీమ్ మరోవైపు రెండు టీమ్ లుగా ఏర్పడ్డారు.

గెటప్ శ్రీను ఈరోజు లడ్డు వేలం జరగబోతుందని చెప్పగా ఇంద్రజ రోజా గారూ లడ్డు వేలం పాడటమంటే జబర్దస్త్ లో జడ్జిమెంట్ అనుకున్నార అని కామెంట్ చేస్తారు.

వెంటనే రోజా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిమెంట్ అనుకున్నారా అంటూ కౌంటర్ ఇచ్చారు.

మీరు ఈ లడ్డు కొనగలరా అని ఇంద్రజ అడగగా ఎంతైనా కొంటానని ఎంతిచ్చైనా కొంటానని రోజా చెప్పడంతో ఇంద్రజ అబ్బో అని అంటారు.

శుభలగ్నంలో జగపతిబాబు గారిని కొన్నట్టు అనుకోకండి ఇది లడ్డూ అంటూ ఇంద్రజ మరో పంచ్ రోజాపై వేస్తారు.

రోజా నన్ను చూసి ఏడవకు అని చెప్పగా ఇంద్రజ ఎక్కువగా మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తారు.

దేవుడి పాట 1,500 అని ఆది చెబుతూ ఈరోజు మీకు ఓటమిని రుచి చూపిస్తానని రామ్ ప్రసాద్ తో ఆది అంటాడు.

రామ్ ప్రసాద్ వెంటనే బాబూ నేను ఉపవాసం ఏమీ తిననని కామెంట్ చేస్తాడు.

నటి అన్నపూర్ణ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.అత్తయ్యా ఏడు వారాల నగలు చేయించుకుందాం అనుకుంటున్నానని ఎంత ఖర్చు అవుతుందని అడగగా అనుకోవడానికి ఏం ఖర్చవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చని అన్నపూర్ణ పంచ్ వేస్తారు.

ఈ ప్రోమోకు 32 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

వీడియో: ఇది కదా మాతృత్వం అంటే.. స్పృహలేని పిల్లను వెటర్నరీకి మోసుకెళ్లిన కుక్క..