Indraja Husband: భార్య కోసం ఏ భర్త చేయని త్యాగం చేసిన ఇంద్రజ భర్త… ఏం చేశారో తెలుసా?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఇంద్రజ ఒకరు.
ఇంద్రజ( Indraja ) ఒకానొక సమయంలో తెలుగు తమిళ కన్నడ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.
అయితే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించిన తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అయితే చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ విధంగా ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
అలాగే పలు సినిమాలలో కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఇంద్రజకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంద్రజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే ఇంద్రజ మాత్రం ముస్లిం కుటుంబానికి చెందినటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
"""/" /
ఈ విధంగా ఇంద్రజ మహమ్మద్ అబ్సర్ తో( Mohammad Abser ) ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుని ముస్లిం ఇంటికి కోడలుగా వెళ్లారు అయితే ఈయన ఇంట్లో ఇంద్రజను ప్రతి ఒక్కరు కూడా చాలా ఆదరించి అభిమానిస్తారని చెప్పాలి .
ఇక ఆ ఈమె భర్త ప్రస్తుతం బిజినెస్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఇంద్రజ జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) కార్యక్రమంలోనూ తన ఫ్యామిలీ గురించి పలు సందర్భాలలో ప్రస్తావించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈమె ఒక సమయంలో తన భర్త గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
"""/" /
ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ తాను బ్రాహ్మణ కుటుంబంలో( Brahmin Family ) జన్మించిన అమ్మాయి కావడంతో నేను ఎలాంటి మాంసాహార పదార్థాలను కూడా తినను కానీ తన భర్త ముస్లిం వ్యక్తి కావడంతో వారి ఇంట్లో మాంసాహారం( Non Veg ) ఎక్కువగా తీసుకుంటారు కానీ నేను వాళ్ళ ఇంటికి అడుగుపెట్టిన తర్వాత నా కోసం ఆ ఇంట్లో ఎవరూ కూడా మాంసాహారం తీసుకోవడం లేదు అంటూ ఈమె తెలియజేశారు ముఖ్యంగా తన భర్త తనకోసం మాంసాహారం తినడమే మానేశారు అంటూ ఇంద్రజ ఒక సందర్భంలో తెలియజేశారు.
"""/" /
ఇలా ఇంద్రజ ఇంట్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా నాన్ వెజ్ చేయలేదట కానీ ఎక్కడికైనా మహమ్మద్ అబ్సర్ ఇంద్రజతో కాకుండా తన ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్స్ తో కానీ బయటకు వెళ్తే అక్కడ నాన్ వెజ్ తినడానికి ఇంద్రజ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఈమె ఒక సందర్భంలో వెల్లడించారు.
నేను చెప్పిన తర్వాతే ఆయన బయట తింటున్నారని కానీ ఇంట్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా నాన్ వెజ్ వండలేదు అంటూ ఇంద్రజ తెలిపారు.
ఇలా తన భార్య కోసం ఆయన మాంసాహారం ఇంట్లో తినకుండా ఉండడం అంటే నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?