నటి హేమకు అవమానం.. టికెట్ కొనే దర్శనానికి వచ్చారా అంటూ?
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
దీనితో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.భక్తులతో పాటు సెలబ్రిటీలు సైతం నవరాత్రులలో అమ్మవారీనీ దర్శించుకుంటున్నారు.
మరియు ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మను ఇప్పటికే పులువురు సెలబ్రిటీలు దర్శించుకున్న విషయం తెలిసిందే.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడకు తాజాగా తెలుగు సినీ నటి హేమ వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకుంది.
దుర్గమ్మను దర్శించుకున్న తరువాత హేమ అనంతరం ప్రత్యేక పూజలు సైతం నిర్వహించింది.ఇక ఆ తరువాత ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పూజ అనంతరం ఆమె ఆలయం వెలుపల ఉన్న మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.
దుర్గమ్మను దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.ఈ సంవత్సరం మిస్ అయిపోతానేమో, రాలేనేమో,ప్రోటో కాల్ సిబ్బంది అంటున్నారు.
అంతేకాకుండా చాలామంది జనాలు అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తుకొని వస్తున్నారని అన్నారు.కానీ లాస్ట్ మినిట్ లో దుర్గమ్మ పిలిచింది.
వచ్చాను చాలా సంతోషంగా ఉంది.ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు అందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు.
అలాగే మీడియా వల్ల పుణ్యమా అని ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనాన్ని, అమ్మవారి ఆలయయాలను లైవ్ ద్వారా చూపిస్తూనే ఉన్నారు.
"""/"/
ఇంకా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న మా అందరికీ ఎంతో పుణ్యం దక్కిందో అలాగే లైవ్ లో చూస్తూ ఇక్కడికి రాలేకపోతున్న భక్తులకు కూడా అంతకంటే ఎక్కువ పుణ్యం దక్కాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ థాంక్స్ అని హేమ చెప్పుకొచ్చింది.
అయితే హేమ స్పీచ్ ముగించి వెళ్తుండగా ఇంతలో ఒక రిపోర్టర్ మేడం మీరు ఎంతమంది వచ్చారు? టికెట్ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించాడు.
అప్పుడు హేమ అమ్మవారికి హుండీలో 10 వేలు వేసాను 20 వేలు పెట్టి చీర కొన్నాను మీరు టికెట్లు గురించి మాట్లాడుతున్నారు.
మేం టికెట్ తీసుకున్నాం.ప్రోటోకాల్ ప్రకారమే దర్శనం చేసుకొనీ, వెళ్తున్నాము.
దీనిని కాంట్రావర్సి చేస్తారా.నేను దుర్గమ్మ భక్తురాలిని.
భక్తి కోసం ఇక్కడికి వచ్చాను తప్ప కాంట్రవర్సీ కోసం రాలేదు.ఏంది తమ్ముడు ఇది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హేమ.
మూవీ కలెక్షన్లను అనాథాశ్రమానికి ప్రకటించిన సోనూసూద్.. ఈ నటుడు రియల్లీ గ్రేట్!