ఆ సినిమాకు నాకు నంది అవార్డ్ అందుకే రాలేదు.. హేమ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన హేమ నటిగా, కమెడియన్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రజిత నుంచి పోటీ ఉండేవారని సురేఖవాణి వాళ్లంతా తన తర్వాత వచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో అందరికీ మెచ్యూరిటీ వచ్చిందని హేమ వెల్లడించారు.వరలక్ష్మి, లతా శ్రీ నాకంటే ముందు ఇండస్ట్రీకి వచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

నేను నెమ్మదిగా ఒక్కో స్టెప్ వేసుకుంటూ శ్రీలక్ష్మీ గారి ప్లేస్ ను తాను భర్తీ చేశానని హేమ పేర్కొన్నారు.

బ్రహ్మానందం హేమ కాంబినేషన్ తర్వాత ఆ స్థాయిలో ఎవరూ భర్తీ చేయలేదని ఆమె తెలిపారు.

కమెడియన్లందరికీ నేనే వైఫ్ రోల్స్ లో ఎక్కువగా నటించానని ఆమె అన్నారు.దర్శకులు తనను ఎక్కువగా సపోర్ట్ చేశారని ఆమె అన్నారు.

త్రివిక్రమ్ రాసిన పాత్రలు తనకు మంచిపేరు తెచ్చిపెట్టాయని హేమ పేర్కొన్నారు.కొన్నేళ్ల క్రితం ప్రముఖ కమెడియన్లు చనిపోయారని నాకు గ్యాప్ రావడానికి ఇది కూడా ఒక కారణమని హేమ తెలిపారు.

"""/"/ ఇప్పుడు నాకు మళ్లీ పాత్రలు పెరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.గుండమ్మ కథ సినిమాకు హీరోలు ఉన్నా గుండమ్మ లేదని దిగ్గజాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు.

నేను ఎక్కడ ఉన్నా ఇండస్ట్రీలో ఉన్నానని ఆమె తెలిపారు. """/"/ అష్టాచమ్మాకు నంది అవార్డ్ వస్తుందని అనుకున్నానని హేమ అన్నారు.

ఒక సినిమాకు అవార్డ్ రావాలని జయసుధ, సన జ్యూరీలో సభ్యులుగా ఉన్న సమయంలో తన పాత్రకు ప్రాపర్ ఎండింగ్ లేదని అసలు ఎవరికీ ఆ సంవత్సరం కామెడీ విభాగంలో అవార్డ్ ఇవ్వలేదని హేమ తెలిపారు.

అయితే పాత్ర సరిగ్గా క్రియేట్ చేయలేదని అవార్డ్ ఇవ్వకపోవడం సరికాదని హేమ అన్నారు.

కమిటీ నిర్ణయం మేరకు అలా జరిగిందని సన చెప్పారని హేమ చెప్పుకొచ్చారు.

పెంపుడు పులితో వాకింగ్.. దుబాయ్ ముద్దుగుమ్మ వీడియో చూస్తే ఫిదా..??