డ్రగ్స్ కేసులో నా పేరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. వాళ్లపై ఫైర్ అయిన హేమ!
TeluguStop.com
ఈరోజు ఉదయం నుంచి డ్రగ్స్ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరకడంతో పాటు పోలీసులు పలువురు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకోవడం గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
రాహుల్ సిప్లిగంజ్, నిహారికలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల పిల్లలు ఈ పబ్ లో పట్టుబడినట్టు సమాచారం.
పట్టుబడిన వారిలో నిహారిక సహా చాలామందికి పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు.అయితే డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నటి హేమ పట్టుబడ్డారని కొన్ని న్యూస్ ఛానెళ్లు ఫేక్ వార్తలను ప్రచారం చేశాయి.
అయితే తన గురించి తప్పుగా వార్తలు ప్రచారం చేసిన ఛానెళ్లపై హేమ ఫైర్ అయ్యారు.
అవాస్తవాలను ప్రచారం చేసిన ఛానెళ్లపై హేమ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తాను అసలు పబ్ కే వెళ్లలేదని హేమ మీడియాతో వెల్లడించారు.డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ తన పేరును ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను బద్నాం చేస్తున్నారని నా గురించి తప్పుగా ప్రచారం చేసేవాళ్లపై ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.
గల్లా అశోక్ సైతం తనకు ఈ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
"""/"/
హేమ క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఆమె గురించి తప్పుగా ప్రచారంలోకి వస్తున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.
డ్రగ్స్ కేసు గురించి రాహుల్ సిప్లిగంజ్, నిహారిక ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఈ వివాదం ద్వారా నిహారిక వార్తల్లో నిలవడం మెగా అభిమానులను బాధ పెడుతోంది.
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!