ఇదెక్కడి అలజడి రా నాయనా.. మా ఎన్నికల్లో శివ బాలాజీ చెయ్యి కొరికిన నటి హేమ?

ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది.ఇక ఈ ఓటింగును జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ లో ఓటింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు.

ఇక ఓటు వేయడానికి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అందరూ వచ్చి తాము వేయాలనుకున్న అభ్యర్థులకు ఓట్లు వేశారు.

ఈసారి ఈ ఎలక్షన్ లో పోటీగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య గట్టి పోటీ జరుగుతుంది.ఇక ఈ రోజు మొత్తానికి ఎలక్షన్ రోజు రానే వచ్చింది.

దీంతో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నరేష్, సాయి కుమార్, శివ బాలాజీ, సుడిగాలి సుధీర్, శివాజీ రాజా సహా సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటింగ్ ను వినియోగించుకుంటున్నారు.

ఇక ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు కొనసాగుతుంది.

ఇక సాయంత్రం 4 గంటలకు ఈ ఓట్లను లెక్కించి రాత్రి 8 గంటల లోపు ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఇక ఇదంతా ఇలా ఉంటే ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గర కొన్ని గొడవలు జరిగినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా తోపుసులాట కూడా చోటు చేసుకుందని తెలుస్తుంది. """/"/ పోటీలో పాల్గొన్న ఇరువురు ప్యానెల్స్ సభ్యుల మధ్య బాగానే వాదనలు జరిగినట్లు సమాచారం.

అంతేకాకుండా మంచు విష్ణు ప్యానల్ కు చెందిన నటుడు శివ బాలాజీకి ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన హేమకు మధ్య వాదనలు జరిగినట్లు తెలుస్తుంది.

పైగా హేమ శివ బాలాజీ చెయ్యి కొరికినట్లు తెలిసింది.అంతేకాకుండా దానికి సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

"""/"/ ఇక నటుడు నరేష్ అక్కడ జరిగిన గొడవ పై స్పందించాడు.అక్కడ గొడవ ఏమీ జరగలేదు అంటూ అది చాలా చిన్నది అని తెలిపాడు.

ఎవరో ఒకరు ప్రకాష్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇక తను ప్రకాష్ రాజ్ కౌగలించుకున్నామని అన్నారు.అంతేకాకుండా శివ బాలాజీని మాత్రం నటి హేమ కోరికారు అని తెలిపాడు.

ఇక శివ బాలాజీని హేమ కొరికిన గుర్తులను నరేష్ మీడియాకు చూపించాడు. """/"/ ఇదిలా ఉంటే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ను నిలిపి వేసినట్లు తెలుస్తుంది.

ఇక శివ బాలాజీని హేమ ఎందుకు కొరికిందో అని బాగా చర్చలు జరుగుతున్నాయి.

అంతేకాకుండా వీరి మధ్య అక్కడ ఏమైనా గొడవలు జరిగాయేమో అని ఇదెక్కడి అలజడి రా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొందరు హేమ చేసిన పనికి బాగా విమర్శలు చేస్తున్నారు.దీంతో హేమ ఈ విషయం గురించి వెంటనే స్పందించింది.

తాను వెళ్తున్న క్రమంలో శివ బాలాజీ చెయ్యి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని అందుకే చెయ్యి కొరకాల్సి వచ్చిందని తెలిపింది.

అంతేకానీ అక్కడ ఏమి గొడవ జరగలేదని, ఇలాంటి దురుద్దేశం లేదని తెలిపింది.శివ బాలాజీ కూడా ఈ విషయం గురించి అంతగా పట్టించుకోలేదని తెలిసింది.

మొత్తానికి ఎన్నడూ జరగని విధంగా ఈసారి ఈ ఎన్నికలు బాగా ఉద్రిక్తంగా మారిందని తెలుస్తుంది.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్