ఆ డైరెక్టర్ లేకపోతే నాకు జీవితమే లేదు… హన్సిక కామెంట్స్ వైరల్!

బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి హన్సిక ( Hansika ) ఒకరు.

ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె గత ఏడాది వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి హన్సిక మరోవైపు వృత్తిపరమైన జీవితాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు.

"""/" / ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఇక ఈమె తెలుగులో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన దేశముదురు ( Desamuduru ) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన విషయం మనకు తెలిసిందే.

ఇలా అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈ సినిమా సమయంలో తనకు కేవలం 16 సంవత్సరాలు వయసు మాత్రమే ఉందని హన్సిక తెలియజేశారు.

ఆ వయసుకే తాను సొంతంగా కారు ఇల్లు కొనుక్కోగలిగాలని తెలియజేశారు. """/" / దేశముదురు సినిమా అవకాశం ఎలా వచ్చిందనే విషయం గురించి కూడా హన్సిక ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందనే విషయం గురించి మాట్లాడుతూ దేశముదురు సినిమాలో అవకాశం రావడానికి డైరెక్టర్ మెహర్ రమేష్ ( Meher Ramesh ) కారణమని తెలిపారు.

మెహర్ రమేష్ కనుక లేకపోతే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదని ఆయన వల్లే కెరియర్ లో ఇలా సక్సెస్ సాధించానని హన్సిక తెలిపారు.

పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) గారు దేశముదురు సినిమా హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారని విషయం తెలియడంతో మెహర్ రమేష్ గారు నా ఫోటో చూయించి ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా అద్భుతంగా నటించారని తనకు చెప్పారు.

అయితే ఆ మాటలు విన్నటువంటి పూరి సర్ నా ఫోటో షూట్ చేసి వెంటనే తన సినిమాలో తీసేసుకున్నాడని ఈ సందర్భంగా హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ షాక్.. ఊహించని నష్టాలు తప్పవా?