పెళ్లయిన రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక.. ఫోటోలు వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన  దేశముదురు( Desamuduru ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి హన్సిక( Hansika ) .

ఇలా మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హన్సిక మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిని దోచి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ఒకవైపు తెలుగు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తమిళ సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నారు.

తమిళంలో స్టార్ హీరోయిన్గా హన్సిక ఓ వెలుగు వెలిగారు. """/" / ఇలా తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె నటుడు శింబు ప్రేమలో పడ్డారు.

ఇక పీకల్లోతు ప్రేమలో పడిన వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరు భావించారు కానీ కొన్ని కారణాలవల్ల ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

ఇలా బ్రేకప్ అయిన విషయాన్ని స్వయంగా హన్సిక ఓ సందర్భంలో వెల్లడించారు.బ్రేకప్ తర్వాత సోహైల్ కతురియా( Sohel Kathuria ) అనే బిజినెస్మెన్ తో ఏడడుగులు నడిచారు.

ప్రస్తుతం ఈమె పలు సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

"""/" / ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలకు ఈమె తన సొంత ఇంటికలను నెరవేర్చుకున్నారు.తాజాగా హన్సిక కొత్త ఇంటిని కొనుగోలు చేసి, నూతన గృహప్రవేశం( House Warming ) చేశారని తెలుస్తోంది.

తాజాగా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో తన భర్తతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తోంది.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..? ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు..?