Girija Shetta : 30ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్.. ఆమె ఎవరంటే?

ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు మళ్లీ సినిమాలలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరమైన చాలామంది నటీనటులు ఈ మధ్యకాలంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతున్నారు.

అలా తాజాగా ఒక నటి కూడా దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీస్తోంది.

ఆమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.ఆ నటి ఎవరు? ఎందుకు సినిమా ఇండస్ట్రీ దూరం అయింది అన్న వివరాల్లోకి వెళితే.

పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు గిరిజా శెట్టర్( Girija Shettar ) ఈ పేరు చెబితే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు, కానీ గీతాంజలి హీరోయిన్( Geethanjali ) అంటే చాలు టక్కున గుర్తుపట్టేస్తారు.

"""/" / ఎందుకంటే మణిరత్నం( Mani Ratnam ) తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది.

ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది.

అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్ గిరిజా శెట్టర్ కేవలం ఐదే సినిమాలు చేసింది.

ఇంగ్లాండ్‌( England )లో సెటిలైన ఈమె తండ్రి ఒక డాక్టర్.ఆయనది కర్ణాటక.

అమ్మది మాత్రం ఇంగ్లాండ్.అలా కన్నడ-బ్రిటీష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది.

18 ఏళ్ల తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీఅలా నటిగా మారింది.

సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్‌లో థీసిస్ చేసింది.హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఇంగ్లాండ్ వెళ్లిపోయిన తర్వాత రైటర్, జర్నలిస్టుగా డిఫరెంట్ ఉద్యోగాలు చేసింది.

"""/" / అయితే ఇన్నేళ్లుగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఈమెని కన్నడ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు ఒప్పించారు.

ఇబ్బని తబ్బిదా ఇలెయాలి అనే సినిమాలో నటించేలా చేశారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే గిరిజా శెట్టర్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు.

ఆమె గురించి చెబుతూ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టారు.ఈ ఫొటో చూసిన తెలుగు ఆడియెన్స్ ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు.

తర్వాత మాత్రం గీతాంజలి బ్యూటీ అని కామెంట్స్ చేస‍్తున్నారు.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…