Subbalakshmi : ఈ అందాల ముద్దు గుమ్మ ఏ హీరోయిన్ కూతురో తెలిస్తే అస్సలు నమ్మరు 

నటి గౌతమి.1987 నుంచి నేటి వరకు ఎంతో బిజీ నటి గా కొనసాగుతోంది గౌతమి.

ఆమె మొదట తెలుగు సినిమా ద్వారానే వెండి తెరకు పరిచయమైంది.దయామయుడు అనే చిత్రంలో క్యామియో రోల్ లో నటించిన తర్వాత గాంధీనగర్ రెండవ వీధి అనే చిత్రంతో ఫుల్ లెన్త్ రోల్ చేసింది.

ఇక తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఎంతో బిజీగా ఉన్న గౌతమి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తుంది.

1998 తర్వాత ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.ఆ తర్వాత దాదాపు ఐదేళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు.

మళ్ళీ 2003లో ఒకసారి 2006లో ఒకసారి కనిపించిన గౌతమి ఏకంగా తొమ్మిదేళ్ల పాటు విరామం ప్రకటించింది.

ఇక 2023వ సంవత్సరానికి ఏకంగా నాలుగు సినిమాలతో బిజీ బిజీగా మారింది గౌతమి.

"""/"/ ఇంక నటి గౌతమికి 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తితో వివాహం జరగగా, పెళ్లైన కొన్ని నెలలకే గౌతమి గర్భం దాల్చింది.

ఇక ఏడాది కూడా వీరి బంధం కొనసాగక ముందే 1999 లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

ఈ జంటకి సుబ్బలక్ష్మి అనే కుమార్తె ఉంది.ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు గౌతమి ఒంటరిగానే ఉన్న 2004లో కమలహాసన్ తో సహజీవనం చేయడం మొదలుపెట్టింది.

12 ఏళ్ల పాటు వీరిద్దరు సహ జీవనం చేసి 2016లో కమల్ తో గౌతమి విడిపోయింది.

ఇక సుబ్బలక్ష్మికి 24 ఏళ్ల వయసు వచ్చింది.ఆమెను నటిగా చూడాలనేది గౌతమి ఏకైక కోరిక.

ఇన్నాళ్లు గౌతమి తన కూతురికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదు.

"""/"/ అయితే నేడు ఎంతో అందంగా హీరోయిన్స్ కన్నా కూడా గ్లామర్ గా ఉన్న సుబ్బలక్ష్మి ఫోటోలను తన ఫోటోతో కలిపి జత చేసి అప్లోడ్ చేసింది గౌతమి.

అచ్చు తన లాగే కనిపిస్తున్న సుబ్బలక్ష్మి హీరోయిన్ అవడానికి సర్వత్రా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక ఆమెను చూసిన వారందరూ కూడా తల్లి కన్నా అందగత్తె అంటూ కామెంట్స్ చేస్తున్నాడం విశేషం.

సుబ్బలక్ష్మి త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాలపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు కానీ సుబ్బలక్ష్మి మాత్రం అచ్చు హీరోయిన్ గానే కనిపిస్తోంది.

ప్రమోషన్స్ విషయంలో వెంకీనే తోపు.. బాలయ్య, చరణ్ నేర్చుకోవాల్సిందే!