సూపర్ స్టార్ రజినీ కోసం ఏడు రోజులు ఉపవాసం ఉన్న నటి... కారణం ఏమిటంటే?

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

సాధారణ బస్ కండక్టర్గా కొనసాగుతున్నటువంటి రజనీకాంత్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇలా తెలుగు తమిళ హిందీ భాషలలో ఈయనకు ఎంతో మంచి ఆదరణ ఉంది.

తాజాగా డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సందర్భంగా రజినికీ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రజనీకాంత్ తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇక ఈయన సరసన ఎంతోమంది అగ్రతారాలు జతకట్టారు.రజనీకాంత్ గారితో నటించిన వారిలో దివంగత నటి శ్రీదేవి కూడా ఒకరు.

వీరిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాలకు పైగా నటించారు.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అయితే 2011వ సంవత్సరంలో రజనీకాంత్ దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా రవికుమార్ దర్శకత్వంలో రానా అనే సినిమాని రజినీకాంత్ ప్రకటించారు.

ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ ప్రారంభమయ్యేసరికి రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

"""/"/ రజనీకాంత్ కు మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయనని సింగపూర్ తరలించారు.

ఇలా రజినీకాంత్ ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో శ్రీదేవి షిరిడి వెళ్లే ఏడు రోజులపాటు దీక్ష తీసుకొని ఉపవాస ఉన్నారని అయితే రజనీకాంత్ క్షేమంగా రావడంతో ఈమె తన దీక్ష విరమించి అనంతరం తన భర్త బోనికపూర్ తో కలిసి రజనీకాంత్ ను పరామర్శించడానికి వెళ్లారని తెలుస్తోంది.

ఇలా రజనీకాంత్ కు సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.

స్టార్ హీరో బన్నీ బెయిల్ రద్దవుతుందా.. ఆ సాక్ష్యాల వల్ల బన్నీకి ఇబ్బందేనా?