ఎన్టీ రామారావు లేకపోతే నేను లేను.. స్టార్ హీరోయిన్ పిచ్చి ప్రేమ..?

ఈ రోజుల్లోనే కాదు పాత రోజుల్లో కూడా సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చేవి.

ఇప్పట్లోలాగా అప్పట్లోనూ హీరోహీరోయిన్లు క్లోజ్‌గా ఉండేవారు.అలనాటి టాప్‌ హీరోయిన్లు పెద్ద హీరోలతో లెక్కలేనన్ని మూవీస్ చేసేవారు.

ఈ రోజుల్లో ఒక హీరోయిన్‌తో ఒక హీరో 2-3 సినిమాలు చేస్తేనే వారి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేస్తారు.

కానీ సావిత్రి, కృష్ణకుమారి, దేవిక వంటి హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్క ఎన్టీఆర్‌తోనే( NTR ) 20 చొప్పున సినిమాలు చేశారు.

అన్ని సినిమాల్లో కలిసి పని చేస్తే ఆటోమేటిక్‌గా అనుబంధం ఉంటుంది.ఆ అనుబంధాన్ని కొంతమంది తప్పుగా భావించి గాసిప్స్ క్రియేట్ చేశారు.

ఈ తరహా గాసిప్స్‌ను కాగడా, హిందు నేషన్‌ వంటి పేపర్స్ ఎక్కువగా పబ్లిష్ చేసి పాఠకులను పెంచుకునేవి.

వీటిలో నిజమంతుందనేది ఆలోచించడం కంటే వాటిని చదివి ఎంజాయ్ చేసే వాళ్లే ఎక్కువగా ఉండేవారు.

ఎన్టీఆర్‌తో కలిసి ఎక్కువ సినిమాలు చేసిందని నటి కృష్ణకుమారితో( Krishna Kumari ) ఆయన ఎఫైర్‌ పెట్టుకున్నట్లు అప్పట్లో పత్రికలు వార్తలు రాశాయి.

కొంతకాలం తర్వాత ఎన్టీఆర్‌, దేవిక( Devika ) మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని రూమర్స్ రాయడం ప్రారంభించాయి.

అయితే ఈ నటులు వీటిని చూసీచూడనట్లు ప్రవర్తించారు. """/" / కానీ ఒకరోజు ఓ జర్నలిస్ట్‌ దేవికను ఇంటర్వ్యూ చేస్తూ ‘ఎన్టీఆర్‌తో మీరు ఎలా ఉండేవారు, క్లోజ్‌గా మెదిలేవారా?’ అని ప్రశ్నించాడు.

అప్పటికే ఎన్టీఆర్, తానూ అఫైర్ పెట్టుకున్నట్లు పుకార్లు వస్తున్నాయని ఆమె తెలుసుకుంది.అందుకే ఆ జర్నలిస్టు ఉద్దేశం ఏమిటో వెంటనే అర్థం చేసుకుంది.

అయినా ప్రశాంతంగా సమాధానం చెబుతూ "రామారావుగారంటే నాకు ఎంతో అభిమానం.ఆయన తన సహనటి పట్ల చాలా గౌరవంగా నడుచుకుంటారు.

ఆప్యాయంగా చూసుకుంటారు.మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే.

ఒక విధంగా రామారావుగారు లేకపోతే నేను లేను.ఈరోజు మీ ముందుకు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాననంటే దానికి కారణం ఎన్టీఆర్ గారే’ అని సమాధానం చెప్పింది.

"""/" / ఆమె చెప్పిన ఈ మాటలు వింటే నిజంగానే ఎన్టీఆర్ అంటే దేవికకి పిచ్చి ప్రేమ ఉందని కొందరు పొరపాటు పడొచ్చు.

కానీ దేవిక ఇలా చెప్పడం వెనుక చాలా మంచి కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా ‘కంచుకోట’ సినిమా( Kanchukota Movie ) షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదంలో పడిన దేవికను ఎన్టీఆర్ కాపాడాడు.

ఇందులోని ‘లేదు లేదని.ఎందుకు నీలో ఉన్నది దాస్తావు’ పాటను తమిళనాడులోని హోగిన్‌కల్‌ వాటర్‌ఫాల్స్‌ దగ్గర షూట్ చేస్తున్నప్పుడు దేవిక పొరపాటున నీళ్లలోకి జారిపోయింది.

చూస్తుండగానే కొట్టుకుపోతుండడంతో అందరూ కేకలు వేశారు.వెంటనే ఎన్టీఆర్ నీళ్లలోకి దూకి చాలా సాహసోపేతంగా ఆమెను పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు.

మరో సినిమా షూటింగ్ సమయంలో దేవిక రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తుండటం చూసి ఎన్టీఆర్ జాలిపడ్డారు.

'ఎందుకండీ ఇలా కష్టపడతారు.కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి' అని ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారట.

అలా తనకు మంచి చెప్పినా ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం అని ఆమె చెప్పింది.

కానీ పత్రికలు మాత్రం ఎన్టీఆర్ ఆమె కోసం తీసుకునే శ్రద్ధను అపార్థం చేసుకుని అఫైర్ పెట్టుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చాయి.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీలో ఆ మలయాళ నటుడు.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వేరే లెవెల్!