అవకాశాలు లేక పంతులమ్మగా మారిన పవన్ హీరోయిన్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హీరోయిన్ గా దేవయాని ( Devayani ) ఒకరు.

ఈమె పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్గా నటించిన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా పలు తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాలలో హీరోయిన్గా నటించినటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.

ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో కూడా నటించి మెప్పించారు. """/" / ఇలా దాదాపు 100 సినిమాలకు పైగా నటించినటువంటి దేవయాని ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా( Teacher ) పని చేస్తున్నారు.

ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె 2001వ సంవత్సరంలో తమిళ డైరెక్టర్ రాజ్ కుమార్( Raj Kumar ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం.ఇక ఈమెకు పెళ్లి కావడంతో సినిమాలలో కూడా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈమె బుల్లితెరపై కూడా నటించారు.ఇక ఆర్థికంగా పరవాలేదు అనుకున్న సమయంలోనే ఈమె భర్త దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేసి భారీగా నష్టపోయారు.

"""/" / ఇలా సినిమా నిర్మాణం చేపట్టి భారీగా అప్పులు పాలైనటువంటి ఈమె క్రమక్రమంగా ఈ అప్పుల నుంచి బయట పడుతూ వచ్చారు.

అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేకపోవడంతో తన పిల్లలు చెన్నైలో చదువుతున్నటువంటి చర్చ్ పార్క్ స్కూల్లోకి టీచరుగా వెళ్తున్నారు.

ఇలా ఈమె ఈ స్కూల్ టీచర్ గా వెళ్తు నెలకు పదివేల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు.

అయితే తనకు ఇలా టీచర్ గా వెళ్లడం చాలా సంతోషంగా ఉందని ఒకానొక సందర్భంలో ఈమె తెలియజేశారు.

ఒకప్పుడు హీరోయిన్గా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఇలా టీచర్ గా మారి 10 వేల రూపాయలకు పని చేస్తున్నారన్న విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

కెనడాలో ఇమ్మిగ్రేషన్ స్కాం : ‘‘ అతనికి ఆ శిక్ష సరిపోదు ’’ .. కోర్టు తీర్పుపై భారతీయ విద్యార్ధుల స్పందన