భానుమతిని చూసి కళ్లు తిరిగి పడిపోయిన అభిమాని.. ఏమైందంటే..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు, స్టార్ హీరోయిన్లకు అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే.
అయితే కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం వీరాభిమానులు ఉంటారు.అయితే ఆ వీరాభిమానం వల్ల కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు ఇబ్బందులు పడక తప్పదు.
సీనియర్ నటి భానుమతిని చూసి ఆమె అభిమాని ఒకరు ఒక సందర్భంలో కళ్లు తిరిగి పడిపోయారు.
భానుమతి చాలా సంవత్సరాల క్రితం తెనాలిలో స్థలం కొనుగోలు చేశారు.ఆ స్థలంను రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ పత్రాల నిమిత్తం భానుమతిని వెళ్లి కలిశారు.
ఆ వ్యక్తి భానుమతితో మాట్లాడుతూ తాను పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు.మీరు నటించిన అన్ని సినిమాలను తాను చూశానని ఆయన వెల్లడించారు.
తెనాలికి భానుమతి గారు ఏ సమయంలోనైనా వస్తే కచ్చితంగా తన ఇంటికి రావాలని ఆమె కోరారు.
ఆమెకు చిరునామాను ఇచ్చి ఆ వ్యక్తి అక్కడినుంచి ఎళ్లిపోయారు. """/"/
ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాను భద్రంగా దాచుకున్న భానుమతి ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత తెనాలి వెళ్లారు.
ఆ సమయంలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి ఆమె తలుపు తట్టారు.
తలుపు తీసిన అభిమాని భానుమతిని చూసి షాకవ్వడంతో పాటు కళ్లు తిరిగి కింద పడిపోయారు.
ఈ ఘటనతో అవాక్కైన భానుమతి నీళ్లు నీళ్లు అని గట్టిగా అరిచి అభిమాని ముఖంపై నీళ్లు చల్లారు.
"""/"/
ఆ తరువాత అభిమాని లేచి కూర్చుకున్నారు.ఒక సందర్భంలో ఈ ఘటన గురించి చెబుతూ అభిమాని నవ్వులపువ్వులు పూయించారు.
ఈ విధంగా సెలబ్రిటీల జీవితాల్లో అభిమానులకు సంబంధించి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.
కొందరు సెలబ్రిటీలకు అభిమానులు మంచి చేసి వార్తల్లో నిలుస్తుంటే మరి కొందరు అభిమానులు మాత్రం విసిగించి వార్తల్లో నిలుస్తున్నారు.
మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?