ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో అప్సరా రాణి ( Apsara Rani )ఒకరు.

ఐటమ్ సాంగ్స్ చేయడం ద్వారా ఈ నటి తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.

అయితే ఈ నటి తాజాగా నాకు ఒకే రకమైన రోల్స్ వస్తుండటంతో సినిమాలు వదిలేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు.

అలాంటి సమయంలో దేవుడు రాచరికం మూవీ టీమ్ ను నా దగ్గరకు పంపించారని ఆమె అన్నారు.

రాచరికం సినిమాలో( Racharikem ) తాను మంచి రోల్ చేశానని అప్సరా రాణి వెల్లడించారు.

ఈ నెల 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.అప్సరా రాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) గురించి మాట్లాడుతూ పవన్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు.

నేను తెలుగు నేర్చుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఈ సినిమాలో ఛాన్స్ దక్కినందుకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని అప్సరా రాణి పేర్కొన్నారు.

"""/" / ఈ సినిమా కోసం తాను ఎంతగానో కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

2019 సంవత్సరంలో అప్సరా రాణి సినీ కెరీర్ మొదలైంది.క్రాక్ సినిమాలోని భూమ్ బద్దల్ సాంగ్ అప్సరా రాణికి మంచి పేరును తెచ్చిపెట్టింది.

సీటీమార్, డీ కంపెనీ ( Citymar, D Company )అనే సినిమాలలో సైతం అప్సరా రాణి స్పెషల్ సాంగ్స్ లో నటించారు.

ఉత్తరాఖాండ్ కు చెందిన ఈ బ్యూటీ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. """/" / అప్సరా రాణికి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ సైతం అంతాఇంతా కాదు.అప్సరా రాణి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అప్సరా రాణి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.అప్సరా రాణి రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

NHలను ఉపయోగించే వారికి శుభవార్త.. ఏడాది, జీవితకాల టోల్ పాస్‌లు అందుబాటులోకి