గేమ్ ఛేంజర్ మూవీ చాలా హర్ట్ చేసింది.. అంజలి సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్( Game Changer ).
ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి.
శంకర్ ( Shankar ) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం విడుదలయింది.
ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించారు.ఇక ఇందులో కియారా అద్వానీ , అంజలి హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.
"""/" /
ఈ సినిమాలో నటి అంజలి( Anjali ) అద్భుతమైన పాత్రలో నటించారు ఆమె నటించిన సినిమాలలో ఎంతో మంచి గుర్తింపు పొందిన పాత్ర ఇది ఒకటి అని చెప్పాలి.
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఈమె ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా రిజల్ట్ తనని బాగా హర్ట్ చేసింది అంటూ అంజలి మాట్లాడారు.
ఒక సినిమాని బాగుందని చెప్పడం వేరు మంచి సినిమా అని చెప్పడం వేరు అంటూ తెలియచేశారు.
"""/" /
గేమ్ ఛేంజర్ సినిమా చూసి నాతో మాట్లాడిన వారు ఎవరు కూడా సినిమా బాగాలేదని చెప్పలేదు ప్రతి ఒక్కరూ కూడా ఇదొక మంచి సినిమా అని నా దగ్గర మాట్లాడారు.
కొన్ని సందర్భాలలో మనం ఎంతో హర్ట్ అవుతూ ఉంటామో అదేవిధంగా నేను కూడా ఈ సినిమా విషయంలో హర్ట్ అయ్యాను అంటూ అంజలి తెలిపారు.
ఈ సినిమాకు వచ్చిన ఫలితాల గురించి మాట్లాడాలి అంటే సుమారు ఒక 40 నిమిషాల పాటు ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటే మాట్లాడగలమని, ఈ సినిమాని నేను వ్యక్తిగతంగా ఎంతో నమ్మానని తెలిపారు.
ఈ సినిమా కోసం తాను 200% కష్టపడ్డాను.ఎంతవరకు ప్రచారం చేయగలనో అంతవరకు చేశాను కానీ అన్ని మన చేతుల్లో ఉండవు కదా అంటూ అంజలి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి.. ఈ కాంబోకు బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే!