పబ్లిక్ గా ఫోన్ నంబర్ ఇచ్చిన జీవిత.... మీకు ధైర్యం ఉంటే అంటూ...

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.ఇప్పటికే ఈ ఎన్నికలలో భాగంగా టాలీవుడ్ ప్రముఖ విలక్షణ నటుడు "ప్రకాష్ రాజ్" మరియు ప్రముఖ హీరో "మంచు విష్ణు" అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే తాము గెలిస్తే మూవీ ఆర్టిస్టులకు ఎలాంటి మంచి జరుగుతుందనే విషయంపై తమ "మేనిఫెస్టో" విడుదల చేయడమే కాకుండా తమ సభ్యులను కూడా ఎన్నుకున్నారు.

అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకి తన మద్దతును తెలియజేసి ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు.

ఈ క్రమంలో తన హయాంలో సెక్రటరీగా పని చేసినటువంటి టాలీవుడ్ ప్రముఖ నటి మరియు దర్శకురాలు "జీవిత" పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే తాజాగా నరేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై నటి జీవిత సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒక్కరోజులో ఎవరూ నిర్ణయించలేరని అలాగే ప్రజలకు కూడా మంచి వాళ్ళు ఎవరు.

? మంచి వాళ్ళలా నటిస్తున్నారనే విషయం పై అవగాహన ఉందని పేర్కొంది.అలాగే తన ఫోన్ నంబర్ ని తెలియజేస్తూ ధైర్యం ఉంటే తాను తప్పు చేసినట్లు నిరూపించాలని సవాల్ చేసింది.

అంతే కాకుండా నరేష్ హయాంలో జరిగిన తప్పొప్పులను కూడా గుర్తు చేసింది.ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉండేటువంటి డైరీ విషయంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తూ తక్కువ ధరలో అయిపోయేటువంటి పనులను ఎక్కువ డబ్బు వెచ్చించి చేయించారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా తప్పిదాలు జరిగాయని ఈ క్రమంలో ఎవరైనా మంచి పనులు చేస్తామని ముందుకువస్తే వారిని ప్రోత్సహించకుండా తొక్కేశారని ఘాటుగా విమర్శలు చేసింది.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ నెల 10వ తారీఖున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే అంశం పై కొంతమేర ఆసక్తి నెలకొంది.

అంతేకాకుండా ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి పలువురు అసోసియేషన్ సభ్యులతో మీటింగులు ఏర్పాటు చేసి ఒకవేళ తాము ఎన్నికలలో గెలిస్తే తాము చేసేటువంటి మంచి పనులపై అవగాహన కల్పించారు.

ఇక మంచు విష్ణు కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పలువురు సినీ పెద్దల మద్దతుని కూడగట్టుకొని ఎన్నికల బరిలో దిగుతున్నాడు.

ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో డౌట్స్ అక్కర్లేదట!