Amy Jackson : భారతీయుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమీ జాక్సన్.. అది బాధాకరం అంటూ?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నటి అమీ జాక్సన్( Amy Jackson )పేరు కూడా ఒకటి.

మొన్నటికి మొన్న ఆమె కొత్త లుక్స్ పై భారీగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

నెటిజన్స్ ఆమెపై నెగటివ్​ కామెంట్స్ చేయడంతో పాటు భారీగా ట్రోల్ కూడా చేశారు.

ఐరిష్‌ స్టార్ యాక్టర్ సిలియన్ మర్ఫీని పోలినట్టు ఆమె కొత్త లుక్‌ ఉందంటూ పలువురు కామెంట్లు చేశారు.

అయితే తాజాగా ఈ ట్రోల్స్​పై అమీ జాక్సన్ రియాక్ట్ అయ్యారు.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.

సోషల్ మీడియాలో ఇండియన్స్​ నుంచి ఇటువంటి ట్రోల్స్​ జరగడం నిజంగా బాధకరమైన విషయం.

"""/" / ఒక స్త్రీ తన అందానికి వ్యతిరేకంగా ఉన్న విధంగా తయారైతే, ట్రోల్ చేసే హక్కు తమకు ఉందని వారు భావిస్తుంటారు.

అయితే నేను సినిమాకు తగ్గట్టు లుక్‌ విషయంలో తరచూ మార్పులు చేసుకునే ప్రముఖ నటులతో కలిసి పని చేశాను.

ఏదైనా ఒక సినిమా కోసం లుక్స్​ పరంగా మార్పులు చూపిస్తుంటే ఎవరైనా ప్రశంసిస్తారు.

కానీ, నన్ను మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.ప్రస్తుతం నేను యూకేలో ఒక సినిమా చేస్తున్నాను.

ఆ సినిమా కోసమే నా లుక్స్​ను ఛేంజ్ చేసుకున్నాను.నేను నా పనిని చిత్త శుద్ధితో చేస్తాను.

"""/" / అందుకే నేను మరింత స్లిమ్​గా పాత్రకు తగ్గటు మారాను అని చెప్పుకొచ్చింది అమీ జాక్సన్.

అనంతరం ఆమె ఐరిష్ యాక్టర్​ సిలియన్ మర్ఫీ( Cillian Murphy )తో తన లుక్‌ను కంపేర్ విషయంపై మాట్లాడుతూ.

దానికి నేనేమీ బాధపడటం లేదు.అలాంటి ఓ గొప్ప యాక్టర్​తో నన్ను పోల్చినందుకు సంతోషిస్తున్నాను అని అమీ జాక్సన్ చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఈ విషయంపై స్పందించిన కొందరు ఆ విధంగా ట్రోల్స్( Amy Jackson Trolls ) చేయడం ఏమీ బాగోలేదు అని కొందరు కామెంట్ చేయగా, ఇంకొందరు ఒక మహిళపై ఆ విధంగా ట్రోల్స్ చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు తెలుసుకొని ప్రవర్తించి కామెంట్స్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళికి ఆ సినిమా అంత కష్టంగా అనిపించిందా.. ఐరన్ లెగ్ అన్నా పట్టించుకోరా?