చచ్చేలోగా ఆ డైరెక్టర్ సినిమాలో చేయాలని ఉంది: నటి ఆమని

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించే అవకాశం రావాలని చాలామంది నటీనటులు ఆశపడుతుంటారు.

ఇప్పటికే ఎంతోమంది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే నటి ఆమని కూడా తన మనసులో మాటను బయటపెట్టారు.ఇ.

వి.వి.

సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకడిపంబ చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఆమని ఆ తర్వాత శుభలగ్నం, మావిచిగురు, పెళ్లి పుస్తకం,మిస్టర్ పెళ్లాం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందారు.

వివాహమైన తర్వాత ఆమని కొద్దిరోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమని వరుస సినిమాలు సీరియల్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు.

"""/"/ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.

తనకు ఎప్పటికైనా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే కోరిక ఉందని అతని సినిమాల్లో నటిస్తానని ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు.

రాజమౌళి దర్శకత్వంలో చిన్న పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమని వెల్లడించారు.

మరి ఈ నటికి రాజమౌళి అవకాశం ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

వయనాడ్ విషాదం.. భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సెలబ్రిటీల జాబితా ఇదే!